తప్పిపోయిన పిల్లల కోసం వెబ్సైట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తప్పిపోయిన పిల్లల కోసం కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంగళవారం ఒక వెబ్సైట్ను ప్రారంభించింది. కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్, శిశుసంక్షేమ మంత్రి మేనకాగాంధీ సంయుక్తంగా ‘‘ఖోయా-పాయా’’ వెబ్సైట్ను ప్రారంభించారు. పౌరులు తమకు ఎవరైనా తప్పిపోయిన పిల్లలు కనిపించినా, అనుమానాస్పద వ్యక్తులతో పిల్లలు కనిపించినా ఈ వెబ్సైట్ ద్వారా తెలపొచ్చు.
ట్రాక్ చైల్డ్ పేరుతో ఇప్పటికే వెబ్సైట్ ఉన్నా అది పోలీసులకు ఉద్దేశించిందని, ఈ కొత్త వెబ్సైట్లో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వాములు కావచ్చని.. సమాచారాన్ని అప్లోడ్ చేయవచ్చని మేనకాగాంధీ తెలిపారు. జాతీయ నేర రికార్డుల బ్యూరో లెక్కల ప్రకారం ఏడాదికి సగటున 70 వేల మంది పిల్లలు అదృశ్యమవుతున్నారు.