మనాలి టు లేహ్ ఐషర్ ట్రాక్టర్థాన్
మనాలి: మనాలి నుంచి లేహ్ వరకు ట్రాక్టర్థాన్ను ఐషర్ ట్రాక్టర్స్ ప్రారంభించింది. ఐషర్ 557, 548 రకం ట్రాక్టర్ల ద్వారా దాదాపు 473 కిలోమీటర్ల మేర ఈ ట్రాక్టర్థాన్ జరగనున్నట్లు సంస్థ తెలిపింది. 50 హెచ్పీ విభాగానికి చెందిన ఈ ట్రాక్టర్లలో క్వాడ్రా డ్రైవ్, డీలక్స్ ప్లాట్ఫామ్, యూరోపియన్ స్టైల్ డిజైన్, హెవీ డ్యూటీ ఫ్రంట్ అండ్ రియర్ యాక్సిల్, సైడ్ గేర్ స్విఫ్ట్, ఆయిల్ ఇమర్స్డ్ బ్రేక్స్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని తెలియజేసింది. ఐషర్ ట్రాక్టర్స్ 20–50 హెచ్పీ విభాగంలో ట్రాక్టర్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ఇంధన సామర్థ్యం, సులభ నిర్వహణ, దృఢత్వం, మంచి పనితీరు, స్థిరత్వం వంటి ప్రత్యేకతలు వీటి సొంతం.