Trade in goods
-
ఐఫోన్ 13 ఉచితం ! ఎక్కడ? ఎప్పుడు? ఎలా?
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్‌కి ఉండే క్రేజ్ వేరు. ప్రత్యర్థి కంపెనీలు ఎన్ని వచ్చినా యాపిల్ మార్కెట్, దాని డిమాండ్ మాత్రమే ఏళ్ల తరబడి చెక్కు చెదరడం లేదు. అత్యాధునిక టెక్నాలజీ అందివ్వడం, బిల్ట్ క్వాలిటీ, డిజైన్ ఎలా ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవడం యాపిల్ ప్రత్యేకత. అయితే ఇప్పుడు యాపిల్ లేటెస్ట్ ఫోన్ ఐఫోన్ 13 సిరీస్‌లో ఉన్న ఫోన్లను ఉచితంగా పొందే ఆఫర్ అందుబాటులో ఉంది. ఏటీ అండ్ టీ యాపిల్ 13 ఫోన్‌ని ఉచితంగా అందించే ఆఫర్‌ని అమెరికాకు చెందిన మొబైల్ ఆపరేటర్ కంపెనీ ఏటీ అండ్ టీ అందిస్తోంది. ట్రేడ్ ఇన్ పద్దతిలో ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచినట్టు ఆ సంస్థ వెబ్సైట్లో ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఆఫర్ అమెరికాలో అందుబాటులో ఉంది. ఇండియన్ కంపెనీలు ఇంకా ఈ తరహా ఆఫర్లను ప్రకటించలేదు. ఇలా పొందవచ్చు - ఏటీ అండ్ టీ వెబ్ పోర్టల్‌లో ట్రేడ్ ఇన్ పద్దతిలో ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 13 మోడల్ 128 జీబీ వేరియంట్ సగటు ధర 999 అమెరిక్ డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో ఈ మొబైల్ రమారమి ధర రూ. 79,900లుగా ఉంది. ఆఫర్ వర్తించే తీరు - ఏటీ అండ్ ఏ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ముందుగా ఓ మోడల్ని ఎంపిక చేసుకోవాలి. అనంతరం అక్కడ అందుబాటులో ఉన్న ఇన్స్టాల్మెంట్ పద్దతిని ఎంపకి చేసుకుని ఫోన్‌ని కొనుగోలు చేయాలి. యాక్టివేషన్ కోసం రూ. 30 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. - కనీసం నెలకు 75 డాలర్లు ఆపైన ఉండే అన్లిమిటెడ్ వాయిస్, మెసేజ్, డేటా అందించే పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ని ఎంపిక చేసుకోవాలి. - నెలవారీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ 290 డాలర్లు ఆపై పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఎంచుకున్న కష్టమర్లకు.. పోస్ట్ పెయిడ్ బిల్లులో 1000 డాలర్ల వరకు దశల వారీగా క్రెడిట్ అవుతాయి - నెలవారీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ 95 డాలర్ల నుంచి 290 డాలర్లలోపు ఎంచుకున్న వారికి పోస్ట్ పెయిడ్ బిల్లులో 800 డాలర్ల వరకు విడతల వారీగా క్రెడిట్ అవుతాయి. - నెలవారీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ 35 డాలర్ల నుంచి 95 డాలర్ల మధ్య ఎంచుకున్న వారికి మొత్తంగా 350 బిల్ క్రెడిట్స్ దక్కుతాయి. మూడు నెలలలోపు పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ యాక్టివేట్ అయిన తర్వాత మూడు బిల్ సైకిల్స్ పూర్తయ్యేలోపు బిల్ క్రెడిట్స్ మీ ఖాతాలో జమ చేస్తామని ఏటీ అండ్ టీ చెబుతోంది. మొబైల్ ఫోన్ ఇన్స్టాల్మెంట్స్ యూజర్ చెల్లించడానికి దాదాపు సమాంతరంగా పోస్ట్‌పెయిడ్ బిల్ క్రెడిట్స్ యూజర్ ఖాతాలో జమ అవుతుంటాయి. మధ్యలో మానేస్తే కొద్ది కాలం పాటే ఏటీ అండ్ టీ నెట్‌వర్క్‌ను ఉపయోగించి మధ్యలో నెట్వర్క్ని మారితే ఫోన్ మిగిలిన ఈఎంఐలను యూజర్ చెల్లించాల్సి ఉంటుంది. మూడు నెలలలోపుగానే నెట్వర్క్ డ్రాప్ అయితే ఈ ఆఫర్ ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు. అన్ని ఈఎంఐలను వినియోగదారుడే చెల్లించాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం ఏటీఅండ్‌టీ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. చదవండి:ఐఫోన్ 12 ప్రో కొనుగోలుపై రూ. 25 వేల వరకు తగ్గింపు..! -
సరిహద్దు దాటితే ప్రవేశ పన్ను
* వాణిజ్య ఉపకరణాలపై చెక్‌పోస్టుల వద్ద 2 శాతం సీఎస్టీ * ముసాయిదా బిల్లు సిద్ధం సాక్షి, హైదరాబాద్: ఆదాయం పెంచుకోవడంలో భాగంగా సరిహద్దులు దాటి రాష్ట్రంలోకి తరలించే వాణిజ్య సరుకులు, ఉపకరణాలపై చెక్‌పోస్టుల వద్ద ప్రవేశ పన్నును పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రవేశపన్ను లేకుంటే సొంత రాష్ట్రంలో వ్యాపారులకు, ఖజానాకు నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం భావి స్తోంది. ప్రవేశపన్ను విధించకపోతే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వస్తువులు తరలిస్తే స్థానిక వ్యాపారులు నష్టపోతారని వాణిజ్య పన్నుల అధికారి ఒకరు వివరించారు. ఈ నేపథ్యంలో వస్తువుల రవాణాపై చెక్‌పోస్టుల వద్ద 2 శాతం మేర సీఎస్టీ విధించాలని నిర్ణయించింది. ఈమేరకు ముసాయిదా బిల్లును ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఇది అడ్వొకేట్ జనరల్ పరిశీలనలో ఉంది. 2 శాతం సీఎస్టీ వీటిపై..: తొలిదశలో 15 రకాల వస్తువులపై సీఎస్టీ విధించాలని వాణిజ్య పన్నుల శాఖ ప్రతిపాదించింది. సిమెంట్, ఐరన్ అండ్ స్టీల్, మార్బుల్స్, గ్రానైట్స్, సిరామిక్ శానిటరీ, అన్ని రకాల ఎలక్ట్రికల్ వస్తువులు, ప్లైవుడ్స్, ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు, మినరల్స్, డైస్ అండ్ కెమికల్స్, బల్క్ డ్రగ్స్, ఐరన్ ఓర్, లిఫ్ట్‌లు, అటోమొబైల్ విడిభాగాలు రెండు శాతం సీఎస్టీ జాబితాలో ఉన్నాయి. 19 చెక్‌పోస్టుల ఆధునీకరణ: రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 11 చెక్‌పోస్టులతోపాటు విభజన తరువాత తెలంగాణ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన 8 కొత్త చెక్‌పోస్టులను ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే చెక్‌పోస్టులకు భూమి కొరత సమస్య ఎదురవుతోంది. ఒక్కో చెక్ పోస్టుకు రవాణా సామర్థ్యం ఆధారంగా రెండు ఎకరాల నుంచి 20 ఎకరాలు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ప్రతి వాహనాన్ని చెక్‌పోస్టుల్లో కెమేరాలో రికార్డు చేస్తారు.