స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్‌కి ఉండే క్రేజ్ వేరు. ప్రత్యర్థి కంపెనీలు ఎన్ని వచ్చినా యాపిల్ మార్కెట్, దాని డిమాండ్ మాత్రమే ఏళ్ల తరబడి చెక్కు చెదరడం లేదు. అత్యాధునిక టెక్నాలజీ అందివ్వడం, బిల్ట్ క్వాలిటీ, డిజైన్ ఎలా ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవడం యాపిల్ ప్రత్యేకత. అయితే ఇప్పుడు యాపిల్ లేటెస్ట్ ఫోన్ ఐఫోన్ 13 సిరీస్‌లో ఉన్న ఫోన్లను ఉచితంగా పొందే ఆఫర్ అందుబాటులో ఉంది.
ఏటీ అండ్ టీ
యాపిల్ 13 ఫోన్‌ని ఉచితంగా అందించే ఆఫర్‌ని అమెరికాకు చెందిన మొబైల్ ఆపరేటర్ కంపెనీ ఏటీ అండ్ టీ అందిస్తోంది. ట్రేడ్ ఇన్ పద్దతిలో ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచినట్టు ఆ సంస్థ వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఆఫర్ అమెరికాలో అందుబాటులో ఉంది. ఇండియన్ కంపెనీలు ఇంకా ఈ తరహా ఆఫర్లను ప్రకటించలేదు.
ఇలా పొందవచ్చు
- ఏటీ అండ్ టీ వెబ్ పోర్టల్‌లో ట్రేడ్ ఇన్ పద్దతిలో ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 13 మోడల్ 128 జీబీ వేరియంట్ సగటు ధర 999 అమెరిక్ డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో ఈ మొబైల్ రమారమి ధర రూ. 79,900లుగా ఉంది.
ఆఫర్ వర్తించే తీరు
- ఏటీ అండ్ ఏ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి ముందుగా ఓ మోడల్‌ని ఎంపిక చేసుకోవాలి. అనంతరం అక్కడ అందుబాటులో ఉన్న ఇన్‌స్టాల్‌మెంట్ పద్దతిని ఎంపకి చేసుకుని ఫోన్‌ని కొనుగోలు చేయాలి. యాక్టివేషన్ కోసం రూ. 30 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
- కనీసం నెలకు 75 డాలర్లు ఆపైన ఉండే అన్‌లిమిటెడ్ వాయిస్, మెసేజ్, డేటా అందించే పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ని ఎంపిక చేసుకోవాలి.
- నెలవారీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ 290 డాలర్లు ఆపై పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఎంచుకున్న కష్టమర్లకు.. పోస్ట్ పెయిడ్ బిల్లులో 1000 డాలర్ల వరకు దశల వారీగా క్రెడిట్ అవుతాయి
- నెలవారీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ 95 డాలర్ల నుంచి 290 డాలర్లలోపు ఎంచుకున్న వారికి పోస్ట్ పెయిడ్ బిల్లులో 800 డాలర్ల వరకు విడతల వారీగా క్రెడిట్ అవుతాయి.
- నెలవారీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ 35 డాలర్ల నుంచి 95 డాలర్ల మధ్య ఎంచుకున్న వారికి మొత్తంగా 350 బిల్ క్రెడిట్స్ దక్కుతాయి.
మూడు నెలలలోపు
పోస్ట్‌పెయిడ్ కనెక‌్షన్ యాక్టివేట్ అయిన తర్వాత మూడు బిల్ సైకిల్స్ పూర్తయ్యేలోపు బిల్ క్రెడిట్స్ మీ ఖాతాలో జమ చేస్తామని ఏటీ అండ్ టీ చెబుతోంది. మొబైల్ ఫోన్ ఇన్‌స్టాల్‌మెంట్స్ యూజర్ చెల్లించడానికి దాదాపు సమాంతరంగా పోస్ట్‌పెయిడ్ బిల్ క్రెడిట్స్ యూజర్ ఖాతాలో జమ అవుతుంటాయి.
మధ్యలో మానేస్తే
కొద్ది కాలం పాటే ఏటీ అండ్ టీ నెట్‌వర్క్‌ను ఉపయోగించి మధ్యలో నెట్‌వర్క్‌ని మారితే ఫోన్ మిగిలిన ఈఎంఐలను యూజర్ చెల్లించాల్సి ఉంటుంది. మూడు నెలలలోపుగానే నెట్‌వర్క్ డ్రాప్ అయితే ఈ ఆఫర్ ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు. అన్ని ఈఎంఐలను వినియోగదారుడే చెల్లించాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం ఏటీఅండ్‌టీ వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు.
చదవండి:ఐఫోన్ 12 ప్రో కొనుగోలుపై రూ. 25 వేల వరకు తగ్గింపు..!
Comments
Please login to add a commentAdd a comment