traffic awareness programme
-
నేను ఎప్పుడూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాను : టాలీవుడ్ హీరోయిన్
సాక్షి, హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని టాలీవుడ్ నటి అంజలి పేర్కొన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ నిబంధనలపై నగర పోలీసులు ఎంజే మార్కెట్లో శనివారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ట్రాఫిక్ అవగాహనపై సిటీ పోలీసులు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రూపొందించిన మూడు షార్ట్ ఫిలిమ్స్‌ను అంజలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. తను ఎల్లప్పుడూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తానని పేర్కొన్నారు. నా డ్రైవర్‌కు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించమని చెప్తానని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోవడానికి కారణమవుతోందన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్, డ్రగ్స్, ఇతర చెడు అలవాట్ల కారణంగా సమాజం ప్రభావితం అవుతుందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహణ కోసం కార్యక్రమం ఏర్పాటు చేశామని, ప్రతది రోజు రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైవేలపై జరిగే ప్రమాదాలకు అతివేగం కారణమవుతోందని అన్నారు. సినిమాల్లో పోలీసులను విలన్లుగా చూపిస్తున్నారు కానీ బయట పోలీసులు నిజమైన హీరోలని, ప్రతది ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబద్ సీపీ అంజనీ కుమార్, అడిషనల్ సీపీ అనిల్ కుమార్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. చదవండి: జాగ్రత్త.. ఇక మీకు మామూలుగా ఉండదు! -
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినవారికి చాక్లెట్లు!
-
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినవారికి చాక్లెట్లు!
క్రిస్మస్ పండగ కోసం షాపింగ్‌లు, ఆర్డర్లు అంటూ ఎవరి పనుల్లో వాళ్లున్నారు. కానీ ఇక్కడ చెప్పుకునే ట్రాఫిక్ పోలీసులు మాత్రం ప్రజలను చైతన్యవంతం చేయడానికి అలుపెరగకుండా కృషి చేస్తున్నారు. గోవాలోని ట్రాఫిక్ పోలీసులు వినూత్న పద్ధతితో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం చేపట్టి వార్తల్లో నిలిచారు. ఇక్కడి ట్రాఫిక్ పోలీసులు సాంటాక్లాజ్‌లా వేషం ధరించి రోడ్లపైకి వచ్చారు. జనాల నోరు తీపి చేస్తూ ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలియజేశారు. జీవితం విలువైనదని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి కష్టాలను కొనితెచ్చుకోవద్దని వాహనదారులకు సూచించారు. ఈ సమయంలో బైక్‌పై వెళ్తున్న కొంతమంది ఐఎస్ఐ గుర్తింపు ఉన్న హెల్మెట్లను వాడటం లేదని గుర్తించారు. పెద్ద వాహనాలు నడుపుతున్నవారు సీటుబెల్టు పెట్టుకోకపోవడం గమనించారు. జాగ్రత్త వహించడం అత్యంత ముఖ్య విషయమని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించవద్దని సుతిమెత్తంగా వారిని హెచ్చరించారు. చాక్లెట్లు పంచుతూ వాహనదారులు పాటించాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్న ట్రాఫిక్ పోలీసులను అక్కడి జనాలు అభినందించారు. ఇలా అర్థం అయ్యేలా ఓపికగా చెప్తే అందరూ కచ్చితంగా రూల్స్ పాటిస్తారని ఓ వాహనదారుడు పేర్కొన్నాడు. అందరూ పండగ బిజీలో మునిగిపోతే ట్రాఫిక్ పోలీసులు మాత్రం వారి విధుల్లో మునిగితేలుతున్నారని ఓ మహిళ పేర్కొంది. -
రోడ్డుపై యువతి డ్యాన్స్.. జనాల మెచ్చుకోలు
ఇండోర్: ట్రాఫిక్ చలానాల రుసుములు విపరీతంగా పెంచినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. చాలామంది వాటిని తప్పించుకోవడమెలా అని ఆలోచిస్తున్నారు తప్పితే ట్రాఫిక్ నిబంధనలు పాటించేందుకు ఇష్టపడట్లేదు. పోలీసులు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇండోర్‌కు చెందిన ఓ యువతి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వివరాలు.. ఇండోర్‌కు చెందిన శుభీ జైన్ అనే యువతి పుణెలో ఎంబీఏ చదువుతోంది. నడిరోడ్డుపై డాన్స్ చేస్తూ ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించవద్దంటూ, హెల్మెట్ ధరించాలంటూ రోడ్డుపై స్టెప్పులు వేస్తూ చెప్తోంది. అయితే తాను చేపట్టిన అవగాహన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఆదరణే లభిస్తోందని ఆమె చెప్పుకొచ్చింది. గత 15 రోజులుగా స్వచ్ఛందంగా అవగాహన కార్యక్రమం చేపడుతున్నాని తెలిపింది. దేశం కోసం ఏదైనా చేయాలన్న తపనతో శుభీ జైన్ ఈ వినూత్న ఆలోచనకు నాంది పలికింది. వాహనదారులు తాను చేస్తున్న పనికి చిరునవ్వుతో బదులివ్వటం మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
తాగండి తప్పులేదు.. కానీ.. : అల్లు అర్జున్
హైదరాబాద్: రూల్స్ బ్రేక్ చేయడం ప్రజలు అలవాటుగా మార్చుకుంటున్నారని హీరో అల్లు అర్జున్ అన్నాడు. మన పరిసరాల పరిశుభ్రత, మన ట్రాఫిక్ తీరు చూసిన వారు మన మనస్తత్వం ఏంటో చెప్పగలరని తెలిపాడు. ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దామని కోరారు. మందు తాగండి.. కానీ ఆ మత్తులో వాహనాలు నడపవద్దని సూచించాడు. ‘నీ కారణాలు తప్పు ముందు నిలబడవు , రూల్స్ కఠినంగా ఉన్నా... ఇంకా మార్పు రావాలి, చాదస్తం అనుకున్నా సరే... అవతలివారి ప్రాణాలతో ఆడుకోవద్దు’ అని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణపై శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్‌తో పాటు సినీ నటుడు అల్లు అర్జున్, దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు. దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. యువతకు అన్నీ విషయాల్లో స్పీడ్ అవసరమే కానీ, డ్రైవింగ్ విషయంలో మాత్రం ఈ స్పీడ్ అవసరంలేదని తెలిపారు. అతివేగానికి మన రహదారులు అనుకూలంగా లేవని చెప్పారు. ఈ సందర్భంగా సీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుకుందామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఈ క్యాంపెయిన్ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. స్ట్రీట్ బేస్ టెక్నాలజీని త్వరలో అందుబాటులో తీసుకురానున్నట్టు తెలిపారు. నగరంలో 15 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తప్పు చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉండాలన్నారు.