Trailers release
-
దుమ్మురేపుతున్న ఇంటెన్స్ రా యాక్షన్ కోనసీమ థగ్స్ ట్రైలర్
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో పాన్ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్. తెలుగులో కోనసీమ థగ్స్ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈమధ్యే విడుదలైన థగ్స్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, ఆర్య, అనిరుధ్, కీర్తిసురేష్‌లో గ్రాండ్‌గా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. -
‘ఈ కథలో పాత్రలు కల్పితం’ ట్రైలర్ బాగుంది : పూరి
పవన్ తేజ్ కొణిదెల, మేఘన జంటగా నటిస్తున్న చిత్రం 'ఈ కథలో పాత్రలు కల్పితం'. అభిరామ్ ఎమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజేష్ నాయుడు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‌కి, సాంగ్స్‌కి, టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు రిలీజ్ చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ దక్కగా, సెకండ్ లిరికల్ సాంగ్‌ను వైఎస్ షర్మిల రిలీజ్ చేశారు. ఆ పాటకి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ రిలీజ్ చేశారు.. ముంబై లో ఉన్న పూరీజగన్నాధ్ ఇంటికి వెళ్లి చిత్ర యూనిట్ ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు. కాగా ఈ కార్యక్రమంలో అంబర్ పేట్ శంకరన్న, నిర్మాత చార్మీ, పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ.. 'ఈ కథలో పాత్రలు కల్పితం' .. టైటిల్ చాలా వెరైటీ గా ఉంది. ట్రైలర్ కూడా బాగుంది. విజువల్స్ అదిరిపోయాయి..సినిమా కూడా చాలా బాగుంటుంది. వెరైటీ స్టోరీ తో రాబోతున్న సినిమా అని ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తుంది. అభిరామ్ ఎమ్. దర్శకత్వం చాలా బాగుంది. నిర్మాత రాజేష్ నాయుడుకి ఈ సినిమా ద్వారా మంచి లాభాలొచ్చి ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా నిర్మించాలని కోరుకుంటున్నాను. పవన్ తేజ్ కొణిదెల, మేఘన చాల బాగా కనిపిస్తున్నారు. సినిమా ని అందరు చూడండి.. ఈ సినిమా కోసం కష్టపడ్డ టీం అందరికి అల్ ది బెస్ట్.. అన్నారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. 'ఈ కథలో పాత్రలు కల్పితం' సినిమా బాగా ఆడాలని కోరుకునే అందరికి నా కృతజ్ఞతలు.. మా ఆహ్వానాన్ని మన్నించి చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి ఒప్పుకున్న డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా కి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, వైఎస్ షర్మిల గారికి, నాగబాబు కొణిదెల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా కి మీరు ఇచ్చిన సహాయ సహకారాలు మర్చిపోలేనివి. అలాగే ఈ చిత్రం ఇంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన అందరికి చిత్ర యూనిట్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అని అన్నారు. ఈ సినిమాకి కార్తిక్ కొడకండ్ల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
ట్రెయిలర్‌తోనే పడేశారు!
సినిమా చూడ్డానికి ముందు ట్రెయిలర్లు విడుదల చేస్తారు... సినిమా మీద ఆసక్తిని పుట్టించడానికి. అదే పద్ధతిని టీవీవాళ్లూ అనుసరిస్తుంటారు. అయితే అసలు కథ తీయడం కంటే ఈ ట్రెయిలర్లు తీయడమే కష్టం. తక్కువ సమయంలోనే కట్టి పారేయాలి. ఇందులో ఏదో ఉంది అనిపించాలి. హిందీవాళ్లు ఈ విషయం మీద పెద్ద కసరత్తే చేస్తుంటారు. వేరే సీరియళ్లు వచ్చే సమయంలో కొత్తగా మొదలవుతున్న సీరియల్ గురించి చెప్పిస్తారు. సీరియల్లోని పాత్రలు కొత్త సీరియల్ గురించి సందర్భానుసారంగా మాట్లాడుకుంటాయి. ఆ తర్వాత ట్రెయిలర్ వేస్తారు. ఆ ట్రెయిలర్స్ కూడా వినూత్నంగా ఉంటాయి. అయితే మన తెలుగులో ఒకప్పుడు ట్రెయిలర్ల మీద పెద్ద దృష్టి పెట్టలేదు. సీరియల్స్‌లోని సీన్లే వేసేసేవారు. కానీ ఇప్పుడు మనవాళ్లు కూడా ట్రెండు మార్చారు. అందుకు ఉదాహరణ... ‘ఆకాశమంత‘ సీరియల్. ఇటీవలే జెమినీ చానెల్లో మొదలైన ఈ సీరియల్ ట్రెయిలర్‌తోనే కట్టిపడేసింది. పిల్లల పెంపకం గురించి విరుద్ధమైన భావాలు కల ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథే ‘ఆకాశమంత’. వాళ్లిద్దరూ తమ అభిప్రాయాలను తమ స్టయిల్లో వెల్లడించడం, పైగా వాళ్లు మంజుల, మేధ లాంటి పాపులర్ నటీమణులు కావడం ఆసక్తిని కలిగించింది. సీరియల్ కోసం ఎదురు చూసేలా చేసింది. మల్టీప్లెక్సులు ప్రేక్షకులకు ఎర వేసి లాగేస్తున్న ఈ సమయంలో... వారిని టీవీలకు కట్టేయడానికి ఆ మాత్రం క్రియేటివిటీని ప్రదర్శించాలి మరి!