నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ
బాలాజీచెరువు (కాకినాడ) :
గ్రామీణ నిరుద్యోగ యువతకు రామానంద రూరల్ డవలప్మెంట్ సోసైటీ ఆధ్వర్యంలో మూడు నెలలు ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు సొసైటీ డైరెక్టర్ డి.రామకృష్ణ శనివారం తెలిపారు. దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా ఉపాధి శిక్షణ ఇస్తున్నామని, పదో తరగతి పాసై 15 నుంచి 35 ఏళ్లు గ్రామీణ యువతీ యువకులు అర్హులన్నారు. శిక్షణ కాలం మూడు నెలలు ఉచిత వసతి, యూనిఫామ్, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. అసక్తి గలవారు తమ బయోడెటాతో కాకినాడ సేఫ్ హస్పటల్ వద్దగల తమ కార్యాలయంలోగాని, 78429 74445 లోంబరులోగాని సంప్రదించవచ్చన్నారు.