transfor
-
Manipur violence: మణిపూర్ కేసులు అస్సాంకు
న్యూఢిల్లీ: సీబీఐ దర్యాప్తు చేస్తున్న మణిపూర్ హింసాకాండ కేసులను అస్సాంకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. వాటి దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు ఒకరిద్దరు న్యాయాధికారులను నియమించాల్సిదిగా గౌహతి హైకోర్టు ను నిర్దేశించింది. ఈ మేరకు ఇంకా పలు ఇతర ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, దారుణంగా లైంగిక హింసకు పాల్పడిన కేసులతో పాటు మొత్తం 17 కేసులు ఇందులో ఉన్నాయి. ఈ దశలో అన్ని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నేర విచారణ, న్యాయ ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకు ఈ దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ పార్డివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా అందులో సభ్యులుగా ఉన్నారు. సీబీఐ ఈ కేసులని అస్సాంకు బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు లాయర్లు చేసిన వాదనను తోసిపుచి్చంది. కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన అభ్యర్థనను ఆమోదించింది. ‘ ప్రధానంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. అస్సాంలో అది చాలా ఎక్కువగా ఉంది‘ అని పేర్కొంది. ‘ కుకీలు, మైతీలు రెండు తెగల వారూ ఎంతో నష్టపోయారు. కొండల్లో, లోయల్లో, అంతటా బాధితులు ఉన్నారు. అందుకే ఇరు వర్గాలకూ న్యాయంగా ఉండేలా తర్వాత అదేశాలిస్తాం‘ అని వివరించింది. మణిపూర్ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన పలు ఆదేశాలు... ► బాధితులు, సాక్షులను కోర్టుకు పిలవకుండా వీడియో కాన్ఫరెన్స్ తదితర మార్గాల్లో వర్చువల్‌గా విచారించాలి. ► ఫస్ట్ క్లాస్ లేదా గౌహతి, అస్సాం సెషన్స్ కోర్టులో పని చేస్తున్న ఒకరు, లేదా ఇద్దరు జ్యుడీíÙయల్ మేజి్రస్టేట్లను గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేయాలి. ► వారు మణిపూర్‌లో మాట్లాడే ఒకటి రెండు భాషలు తెలిసిన వారైతే మంచిది. ► నిందితుల హాజరు, రిమాండ్, కస్టడీ, దాని పొడిగింపు వంటి విచారణ ప్రక్రియలన్నీ ఆన్లైన్లో జరిపేందుకు అనుమతి. ► దూరం, భద్రత తదితర కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం. ► ప్రయాణ సమస్య కారణంగా నిందితులకు మణిపూర్ లోనే జ్యుడీíÙయల్ కస్టడీకి అనుమతి ► స్టేట్మెంట్ నమోదు తదితరాల కోసం మణిపూర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఒకరు, లేదా ఇద్దరు మేజిస్ట్రేట్లను నియమించాలి. ► దోషుల గుర్తింపు పరేడ్లు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపేందుకు అనుమతి. ► సోదాలు, అరెస్ట్ వారెంట్లను కూడా ఆన్లైన్లో జారీ చేయొచ్చు. ► జస్టిస్ గీత మిట్టల్, సారథ్యంలోని ముగ్గురు మహిళా న్యాయమూర్తుల ప్యానల్ సజావుగా పని చేసేందుకు అనువైన ఆదేశాలను సెపె్టంబర్ 1న ఇస్తారు. -
టెన్షన్.. టెన్షన్...
జిల్లాలకు కేటాయింపులపై ఉద్యోగుల్లో అయోమయం ఎవరు ఏ జిల్లాకు అనేదానిపై ఇప్పటికీ స్పష్టత కరువు బదిలీల కోసం ఎదురు చూపులు 10న ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు కొందరికి ప్రత్యేక మినహాయింపులపైనా సందిగ్ధం హన్మకొండ అర్బన్: ‘సార్... ఏమైనా తెలిసిందా.. ఇక్కడే ఉంచుతారా.. పంపిస్తారా..? ఏ జిల్లాకు పంపిస్తారు. మార్పులకు అవకాశం ఇస్తారా.. మా ఫ్యామిలీ పరిస్థితి బాగాలేదు. అందుకే ఎక్కడిస్తారో అని టెన్షన్‌గా ఉంది. మీకేమైనా తెలిస్తే చెప్పండి’. ఇలా ఎక్కడ చూసినా ఉద్యోగుల మధ్య ఇదే సంభాషణ. అందరిలోనూ ‘కొత్త జిల్లాల’ టెన్షనే. వారిలో సద్దుల బతుకమ్మ... దసరా పండుగ సంతోషం కానరావడం లేదు. ఒకేసారి ఉత్తర్వులు చేతిలో పెట్టి ఏ జిల్లాకు వెళ్లమంటారోననే ఆందోళన ఉంది. కనీసం నాలుగు రోజుల ముందు తెలిసినా బదిలీ విషయంలో మానసికంగా సిద్ధమయ్యేవారు. ఇప్పుడలా లేదు. దీంతో మహిళా ఉద్యోగులు, ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్నవారు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారు. టెన్షన్... టెన్షన్‌గా కాలం వెళ్లదీస్తున్నారు. పదో తేదీనే ఉత్తర్వులు ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు ఆయా శాఖల వారీగా సంబంధిత శాఖల ప్రధాన కార్యదర్శులకు చేరింది. వాటిని ఆమోదించి ఈ నెల 9న జిల్లాలకు పంపనున్నట్లు సమాచారం. వాటి ఆధారంగా జిల్లా కలెక్టర్ తుది ఉత్తర్వులు 10వ తేదీన మాత్రమే ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే జిల్లా అధికారులు పంపిన ప్రకారం ఆమోదం పొందుతాయా... రాష్ట్ర స్థాయిలో మార్పులు చేస్తారా అన్న విషయంలో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ లెక్కన 9న రాత్రి లేదా 10న ఉదయం మాత్రమే ఎవరెక్కడికి అన్న విషయం తేలనుంది. రెవెన్యూలో రహస్యంగా.. మిగతా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల వివరాలు, సీనియార్టీ విషయాలు, ప్రతిపాదనలు అందరికీ దాదాపు తెలిసే జరిగాయి. అయితే రెవెన్యూలో మాత్ర పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. రహస్య సమావేశాలు, నివేదికలతో ఉద్యోగుల్లో ఉత్కంఠ మరింత పెంతున్నారు. దీంతో ఉద్యోగుల్లో నిరసన వ్యక్త మవుతోంది. ముందస్తుగా ప్రాథమిక సమాచారం చెప్పడకుండా ఒకరిద్దరు కలెక్టరేట్లో ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మినహాయింపులు ఎవరికి? బదిలీల విషయంలో మినహాయింపులు ఎవరికి ఉంటాయన్న విషయలో కూడా స్పష్టత లేదు. మహిళలు, ఉద్యోగ సంఘాల నేతలు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి దగ్గరలో పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం సూచించినా ఏ మేరకు అమలవుతుందన్నది ప్రశ్నార్థకమే. కొత్త జిల్లాలకు సామగ్రి తరలింపు కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు సామగ్రి తరలింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. జయశంకర్, మహబూబాబాద్ జిల్లాలతోపాటు జనగామ జిల్లాకు జిల్లా అధికారులు సామగ్రి తరలిస్తున్నారు. శుక్రవారం కలెక్టరేట్ ట్రెజరీ కార్యాలయం నుంచి జయశంకర్, మహబూబాబాద్ జిల్లాలకు సామగ్రిని వాహనాల్లో పంపించారు. డీడీ రాజుతోపాటు అధికారులు శ్రీనివాస్‌రెడ్డి, రాజేందర్ తదితరులు పంపిణీ కార్యక్రమాలు పర్యవేక్షించారు. పౌరసరఫరాల కార్యాలయం నుంచి మహబూబాబాద్‌కు, కలెక్టరేట్ నుంచి జనగామ జిల్లాలకు సామగ్రితో వాహనాలు బయల్దేరాయి.