Transport Minister Gadkari
-
9 లక్షల వాహనాలు తుక్కుకే: నితిన్ గడ్కరీ
కాలం చెల్లిన వాహనాలను వదిలించుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. ఏప్రిల్ 1 నుంచి ఆ వాహనాలు రోడ్లపై తిరగకుండా అనుమతుల్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ ఘడ్కరీ అధికారిక ప్రకటన చేశారు. పరిశ్రమల సంస్థ ఫిక్కీ (fcci) నిర్వహించిన కార్యక్రమంలో నితిన్ గడ్కరీ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ..పర్యావరణానికి హానికలిగించే వాహనాల్ని స్క్రాప్‌గా మార్చనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్టీసీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో 15 ఏళ్లు దాటిన 9 లక్షలకు పైగా కార్లు, బస్సులు తదితర వాహనాలను ఏప్రిల్ 1 నుంచి రోడ్డెక్కబోవు. రిజిస్ట్రేషన్ రద్దు చేసి వాటన్నింటినీ తుక్కు కింద మార్చేస్తామని అన్నారు. వాటిని పర్యావరణహిత ప్రత్యామ్నాయ ఇంధనాలతో కూడిన కొత్త వాహనాలను భర్తీ చేస్తామన్నారు. అయితే రక్షణ, సైనిక వాహనాలు, ప్రత్యేక వాహనాలు తదితరాలకు ఇది వర్తించబోదన్నారు. -
2070 నాటి కల్లా భారత్ కార్బన్ న్యూటల్ దేశంగా మారాలి: నితిన్ గడ్కరీ
Nitin Gadkari Said We All Must Be Aligned to Be Carbon Neutral Country by 2070: ఇటీవల COP-26 శిఖరాగ్ర సమావేశంలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన నిబద్ధతకు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అంతేకాదు 2070 నాటికి ఎటువంటి ఉద్గారాలు లేని లేదా కార్బన్-న్యూట్రల్ దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా భారత్ కృషి చేయాలన్నారు. ఐసీసీకి చెందిన ఏజీఎం అండ్ వార్షిక సెషన్లో భారత్ @ 75 ''ఎంపవరింగ్ ఇండియా: టుమారో ఫర్ టుమారో''పై మంత్రి ప్రసంగిస్తూ, అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణలు డిజిటలైజేషన్‌ను వంటి వాటితో దేశంలో సుస్థిరమైన అభివృద్ధి జరుగుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈమేరకు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ... "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రయాణంలో మన ప్రభుత్వం రేపటిని నిర్మించే దిశగా పటిష్టమైన అడుగులు వేస్తున్న మలుపులో మేము నిలబడి ఉన్నాం. ఇది మన నేటి కంటే చాలా శక్తివంతమైనది. ఆత్మనిర్భర్ ఈ వాతావరణాన్ని తట్టుకోగలదు." అని అన్నారు. అంతేకాదు ప్రభుత్వం గ్రీన్ హైవే మిషన్ కింద జాతీయ రహదారుల వెంబడి చెట్ల పెంపకం గొప్ప సరికొత్త మార్పిడిగా అభివర్ణించారు. అయితే మౌలిక సదుపాయాల కల్పనలో భారీ పెట్టుబడుల ప్రయోజనాలను వినియోగించుకోవచ్చు అని చెప్పారు. ఈ మేరకు కారిడార్‌లో లాజిస్టిక్స్ పార్కులు, స్మార్ట్ సిటీలు, ఇండస్ట్రియల్ పార్కులను నిర్మించడంలో ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టవచ్చని అన్నారు. అంతేకాక భారతమాల ఫేజ్ 1, 2 కింద 65,000 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని మంత్రి తెలిపారు. భారత్‌మాల ఫేజ్-1 కింద సుమారు 35,000 కి.మీ హైవేలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక ఉందని, మొత్తం మూలధన వ్యయం ₹. 10 లక్షల కోట్లు అని వెల్లడించారు. పైగా 20 వేల కి.మీ.లు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయన్నారు. అయితే 2025 నాటి కల్లా 2 లక్షల కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోందంటూ గడ్కరీ చెప్పుకొచ్చారు. -
నెత్తు'రోడ్డు'తోంది
* గతేడాది 5 లక్షల రోడ్డు ప్రమాదాలు * 1.46 లక్షల మంది మృతి * కొత్త చట్టంలో కఠిన నిబంధనలు: గడ్కారీ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో రోజూ 400 మంది మృతిచెందుతున్నారని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కారీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో ముంబై (23,468), మరణాల్లో ఢిల్లీ (1,622) తొలిస్థానాల్లో ఉన్నాయన్నారు. రోడ్డుప్రమాదాల నివేదిక -2015ను మంత్రి గురువారం విడుదల చేశారు. దేశవ్యాప్తంగా గంటకు 57 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా... 17 మంది మరణిస్తున్నారు. మృతుల్లో 54 శాతం మంది 15-34 మధ్య వయసువారే. 2015లో మొత్తం 5 లక్షల ప్రమాదాలు సంభవించగా... 1.46 లక్షల మంది మృత్యువాత పడ్డారు. 13 రాష్ట్రాల్లోనే 87.2 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. తమిళనాడు ప్రథమ స్థానంలో ఉండగా, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఏపీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో అత్యధిక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వేగ పరిమితి దాటితే డ్రైవర్లను పట్టుకునేందుకు జాతీయ రహదారులపై కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నిబంధనల్ని ఉల్లంఘించి వాహనాలకు అదనపు వస్తువుల్ని బిగిస్తే రూ.5వేల వరకూ జరిమానా విధించేలా కొత్త జాతీయ భద్రతా బిల్లును తెస్తామన్నారు. ఆ వస్తువుల డీలర్లు, తయారీదారులపై రూ. లక్ష వరకూ జరిమానా విధిస్తామన్నారు.