స్తంభించిన రవాణా
చార్జీలపై లారీల సమ్మె
ఫైనా¯Œ్స ఎంట్రీ వందల రెట్లు పెరుగుదల
రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్
ఆలస్యమైనా జేబు గుల్లే
సాక్షి, రాజమహేంద్రవరం:
రవాణారంగానికి సంబంధించిన చట్టానికి సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనివల్ల రవాణారంగం కుదేలవుతుందని రవాణాదార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మోటారు వెహికల్ నిబంధనల చట్టం (1989)లో చార్జీలకు సంబంధించిన రూల్ నం. 32, 81లను సవరించడంతో సరుకు రవాణా వాహనాలపై చార్జీలు భారీగా పెరిగిపోయాయి. దీన్ని నిరసిస్తూ పలు మార్లు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. గత నెల తొమ్మిదో తేదీన బంద్ పాటించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో గురువారం నుంచి దేశ వ్యాప్తంగా సమ్మె చేపట్టారు.
ఆందోళనలు ఇందుకే..
మోటార్‌సైకిల్ రిజిస్ట్రేష¯ŒS చార్జీ గతంలో రూ.450 ఉండగా ప్రస్తుతం రూ.685 చలానా కట్టించుకుంటున్నారు. కారుకు గతంలో రూ. 735 ఉండగా అది రూ. 1135కు పెరిగింది. కారు ఫైనా¯Œ్స ఎంట్రీ రూ. 735 ఉండగా అది కాస్త మూడురెట్లు పెరిగి రూ. 2,035లకు చేరుకుంది. ఆటో, లైట్వెహికల్, వ్యవసాయ అవసరాలకు వినియోగించే ట్రాక్టర్ రిజిస్ట్రేషన్, ట్రా¯Œ్సఫర్, ఫైనా¯Œ్స ఎంట్రీ చార్జీలు విపరీతంగా పెంచారు. ఈ వాహనాలకు గతంలో రిజిస్ట్రేష¯ŒS చార్జీ చలానా రూ.450 నుంచి రూ. 1150లకు పెంచారు. ట్రా¯Œ్సఫర్ రూ. 250 నుంచి రూ.650లకు, ఫైనా¯Œ్స ఎంట్రీ రూ.100 నుంచి ఏకంగా రూ.1650లకు పెంచేశారు. లారీ రిజిస్ట్రేష¯ŒS గతంలో రూ. 900 ఉండగా ఇప్పడు రెట్టింపయింది. ట్రా¯Œ్సఫర్ చలానా రూ. 600 నుంచి రూ.1050కు పెంచారు. ఫైనా¯Œ్స ఎంట్రీ రూ. 400 ఉండగా ఇప్పడు రూ. 3,300లకు చేరుకుంది. వాహనాలు రిజిస్ట్రేష¯ŒS చేయించడంలో ఆలస్యమైతే అపరాధ రుసుం ప్రతి మూడు నెలలకో విధంగా పెంచారు. గతంలో ఏదైనా వాహనం విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటే ఆవాహనాలపై చార్జీ రూ. 100 ఉండగా ఇప్పుడు దాన్ని రూ. 2,500 చేశారు.
ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆలస్యంపై బాదుడే..
సాధారణంగా ప్రతి ఏడాదీ వాహనాన్ని పరీక్షంపజేసుకుని ఫిట్¯ðనెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. కొత్త నిబంధనల ప్రకారం ఈ సర్టిఫికెట్ ఆలస్యమైతే గడువుతీరిన తర్వాత రోజుకు రూ. 50 చొప్పున అపరాధ రుసుం విధిస్తారు.
ఆందోళనలు
విరమించేది లేదు
రాష్ట్ర విభజన తర్వాత రవాణా రంగం కుదేలయింది. అప్పటికే చార్జీలు కట్టినా తెలంగాణలోకి వెళితే తాజాగా చలానాలు కట్టించుకుంటున్నారు. ఇప్పుడు ఈ చార్జీలు పెంచడం వల్ల రవాణా రంగం కోలుకోలేదు. ఆదాయమే పరమావధిగా చార్జీలను విపరీతంగా పెంచేశారు. ప్రభుత్వం తమ నిర్ణయంపై పునరాలోచన చేసే వరకు సమ్మె కొనసాగుతుంది.
– వాసంశెట్టి గంగాధరరావు, ఆటోవర్కర్స్ యూనియ¯ŒS ప్రెసిడెంట్, రాజమహేంద్రవరం