tribal welfare principal secretary
-
పోలవరం : మరో అధికారిపై సస్పెన్షన్ వేటు
సాక్షి, జంగారెడ్డిగూడెం/పశ్చిమగోదావరి : పోలవరం పునరావాస ప్యాకేజీ (రిలీఫ్ అండ్ రిహబిలిటేషన్) లో అవినీతికి సహకరించారనే ఆరోపణలతో మరో అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె.శాంతిశ్వరరావును సస్పెండ్ చేస్తున్నట్టు ఏపీ సోషల్ వెల్ఫేర్ పిన్సిపల్ సెక్రటరీ సిసోడియా ప్రకటించారు. జంగారెడ్డి గూడెం మండలంలోని తాడువాయి, చల్లవారి గూడెం, మంగిశెట్టి గూడెం గ్రామాల్లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో శాంతిశ్వరరావు అవినీతికి సహకరించినట్టు నిరూపణ అయిందని తెలిపారు. సుమారు 1200 వందల ఎకరాల భూసేకరణలో అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది అధికారులు ఇప్పటికే సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆర్ అండ్ ఆర్‌లో అవినీతి జరిగిందంటూ సాక్షి టీవీలో వెలువడిన పలు కథనాలకు అధికారులు స్పందించి ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. -
బదిలీపై అసంతృప్తి లేదు : సోమేష్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కమిషనర్ నుంచి గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ తెలిపారు. శనివారం గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శిగా సోమేష్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సోమేష్‌కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ... ఉద్యోగ నిర్వహణలో బదిలీలు సాధారణమని ఆయన పేర్కొన్నారు. గతంలో గిరిజన శాఖలో పని చేసిన అనుభవం ఉందని గుర్తు చేసుకున్నారు. గిరిజన శాఖలో మరింత బాగా పని చేస్తానని సోమేష్‌కుమార్ చెప్పారు. అంతకు ముందు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతల నుంచి సోమేష్ కుమార్ రిలీవ్ అయ్యారు. జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా బి.జనార్దన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.