
బదిలీపై అసంతృప్తి లేదు : సోమేష్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కమిషనర్ నుంచి గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ తెలిపారు. శనివారం గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శిగా సోమేష్కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సోమేష్కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ... ఉద్యోగ నిర్వహణలో బదిలీలు సాధారణమని ఆయన పేర్కొన్నారు.
గతంలో గిరిజన శాఖలో పని చేసిన అనుభవం ఉందని గుర్తు చేసుకున్నారు. గిరిజన శాఖలో మరింత బాగా పని చేస్తానని సోమేష్కుమార్ చెప్పారు. అంతకు ముందు జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతల నుంచి సోమేష్ కుమార్ రిలీవ్ అయ్యారు. జీహెచ్ఎంసీ నూతన కమిషనర్గా బి.జనార్దన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.