Truck rams
-
ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టిన ట్రక్కు.. సీఐ దుర్మరణం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును ట్రక్కు ఢీకొట్టిన దుర్ఘఘనలో ఓ పోలీస్ ఇనస్పెక్టర్ మృత్యువాతపడ్డాడు. మదిపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం వెలుగుచూసింది. వివరాలు.. ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన సీఐ జగ్బీర్ సింగ్ ప్రయాణిస్తున్న కారు సాంకేతిక సమస్యతో రోహ్తక్ రోడ్డుపై ఆగిపోయింది. దీంతో కారు దిగి ఆయన పక్కన నిల్చున్నాడు. అదే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జగ్బీర్ సింగ్ అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి నిలిపి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక కావాలనే హత్య కుట్రతో జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కాశ్మీర్లో సెలవుపై వచ్చిన భారత జవాను అదృశ్యం Delhi | A Delhi Police inspector died after his car was hit by a truck from behind on Rohtak Road, near Madipur metro station. The car had stopped due to some mechanical problem and the deceased was standing outside when his car was hit by the truck. The deceased has been… pic.twitter.com/qDE5aLHP4x — ANI (@ANI) July 30, 2023 -
ఐదుగురు పోలీసులు దుర్మరణం
పట్నా : బిహార్లో దారుణం జరిగింది. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల పైకి ఓ భారీ వాహనం దూసుకొచ్చింది. ఈ సంఘటనలో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు గాయాలపాలయ్యారు. గాయపడినవారిలో ఓ డీఎస్పీ, ఓ ఇంచార్జీ పోలీసు అధికారి, కానిస్టేబుళ్లు ఉన్నారు. పోలీసుల వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ప్రమాదానికి కారణమైన భారీ వాహనం డ్రైవర్ పరారయ్యాడు. ఇంకా అతడిని అరెస్టు చేయాల్సి ఉంది. ఆదివారం రాత్రి బిహార్లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం డీఎస్పీ మురారీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి అఖురహా అనే గ్రామం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా మోతిహారి వైపు నుంచి వేగంగా వచ్చిన వాహనం నేరుగా పోలీసులపైకి దూసుకొచ్చింది. తొలుత ఓ పోలీసు కారును ఢీకొట్టగా అది గాల్లో లేచి 40 అడుగుల దూరంలో పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ వెంటనే నేరుగా పోలీసులపైకి వెళ్లిన వాహనం వారిని చిద్రం చేసిందని తెలిపారు. కొంతమంది గాయపడ్డారని, వారిని వెంటనే ముజఫర్ నగర్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న మేజిస్ట్రేట్ యాక్సిడెంట్ వివరాలు తెలుసుకున్నారు. వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా?, తాగిన మైకంలో ఉండటం వల్ల జరిగిందా? లేక నిద్రపోవడమే ప్రమాదానికి కారణమా అనే వివరాలు తెలియాల్సి ఉంది.