breaking news
TS employees
-
25నే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల జీతం ముందుగానే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ నెల 25నే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించనుంది. కాగా ప్రతి నెలా 1న ఉద్యోగులకు నెల జీతాలను ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఈనెల 29న సద్దుల బతుకమ్మ, 30న దసరా పండుగలు కావటంతో జీతాన్ని ముందుగా చెల్లిస్తే ఉద్యోగులకు పండుగ ఖర్చులకు ఉపయోగపడుతుందనే అభిప్రాయాలున్నాయి. దీంతో ఉద్యోగ సంఘాలు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. ఇందుకు సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖ సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు పంపించింది. ఆర్థిక శాఖ ప్రతిపాదనలకు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. లాగే ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏను కూడా చెల్లించాలని ఆదేశించారు. దీంతో అయిదు రోజుల ముందుగానే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు అందుకోనున్నారు. డిసెంబర్ 15 నుంచి 19 వరకూ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.50 కోట్లు మంజూరు చేశారు. సాహిత్య అకాడమీకి రూ.5 కోట్లు, అధికార భాషా సంఘానికి రూ.2 కోట్లు మంజూరు చేశారు. వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అలాగే ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల బోర్డులు ఇకపై తెలుగులోనే రాయాలని ఆదేశాలు జారీ చేశారు. -
దసరాకు ముందే ఉద్యోగులకు వేతనం!
- సీఎం ఆమోదానికి ఫైలు పంపిన ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల జీతం ముందుగానే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖ సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు పంపించింది. ప్రతి నెలా 1న ఉద్యోగులకు నెల జీతాలను ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ ఈనెల 29న సద్దుల బతుకమ్మ, 30న దసరా పండుగలు కావటంతో జీతాన్ని ముందుగా చెల్లిస్తే ఉద్యోగులకు పండుగ ఖర్చులకు ఉపయోగపడుతుందనే అభిప్రాయాలున్నాయి. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు సైతం ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. ఆర్థిక శాఖ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం లభించిన వెంటనే జీతాల ముందస్తు చెల్లింపుపై స్పష్టత రానుంది.