TSCHE Chairman Papi Reddy
-
ఆటా ఆధ్వర్యంలో 'యూఎస్ హయ్యర్ ఎడ్యుకేషన్' సెమినార్
హైదరాబాద్ : అమెరికన్ తెలుగు అసొసియేషన్(ఆటా), తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీఎస్సీహెచ్ఈ) ఆధ్వర్యంలో ' యూఎస్ హయ్యర్ ఎడ్యుకేషన్' పై గురువారం సెమినార్ నిర్వహించారు. అమెరికాలో ఉన్నత విద్యను చదవాలనుకుంటున్న విద్యార్థులకు సరైన ప్రణాళిక, అనుసరించాల్సిన వ్యూహం, మార్గదర్శనం చేయడమే ఈ సెమినార్ ముఖ్య ఉద్దేశం.తెలంగాణ ఉన్నత విద్య మండలి చైర్మన్ టి. పాపిరెడ్డి మాట్లాడుతూ.. ఆటా ఆధ్వర్యంలో ఈ సెమినార్‌ను నిర్వహించడం గర్వంగా ఉందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు సరైన కాలేజీని ఎంపిక చేసుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థులకు సమయం ఆదా అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సెమినార్ నిర్వహించిన ఆటాకు, యూస్ కాన్సులేట్ జనరల్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బి. వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి వచ్చేవారు 80శాతం మంది గ్రామీణ విద్యార్థులే ఉంటారని, అందులోనూ మద్య,దిగువ తరగతికి చెందినవారే ఉంటారని పేర్కొన్నారు. దీంతోపాటు ప్రాజెక్టు వర్క్‌కోసం వచ్చే విద్యార్థులకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలను వివరించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూఎస్ కాన్సులేట్ కన్సులర్ సెక్షన్ హెడ్ ఎరిక్ అలెగ్జాండర్, స్టేట్ యునివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ రిజిష్ట్రార్ రాజశేఖర్ వంగపతి, ఆటా ప్రెసిడెంట్ పరమేశ్ భీమ్‌రెడ్డి, భువనేశ్ కుమార్, జయదేవ్ చల్లా, కవిత(తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం), జాఫర్ జావేద్, ఫ్రొపెసర్ లింబాద్రి, ఫ్రొపెసర్ వి. వెంకటరమణ(టీఎస్సీహెచ్ఈ వైస్ చైర్మన్), సుల్తాన్ ఉల్ ఉలూం యునివర్సిటికీ చెందిన 50 మంది విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
పిట్స్బర్గ్ వర్సిటీతో ఎంవోయూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని వర్సిటీలకు అకడమిక్ సహకారం అందించే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అమెరికాలోని పిట్స్బర్గ్ వర్సిటీతో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గురువారం అవగాహనా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, పిట్స్బర్గ్ వర్సిటీ గ్లోబల్ అఫైర్స్ వైస్ ప్రోవోస్ట్ డాక్టర్ ఏరియల్ ఆర్మోనీ పరస్పరం ఎంవోయూలను మార్చుకున్నారు. ఏరియల్ ఆర్మోని మాట్లాడుతూ, 1787లో ఏర్పాటైన తమ వర్సిటీ వైద్యం, విద్య, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ రంగాల్లో బోధన, పరిశోధనలు చేస్తోందన్నారు. ప్రస్తుతం వర్సిటీ అమెరికాలో 5 క్యాంపస్‌లు, 28 వేల మంది విద్యార్థులను కలిగి ఉందన్నారు. ఈ ఎంవోయూ ద్వారా రాష్ట్రం లోని వర్సిటీలు, పిట్స్బర్గ్ వర్సిటీల మధ్య పరస్ప రం విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి, పరిశోధనల్లో సహాయసహకారం లభించనుందని పాపిరెడ్డి పేర్కొన్నారు. పిట్స్బర్గ్ వర్సిటీ అందిస్తున్న ఉత్తమ కోర్సులు, సబ్జెక్టులను రాష్ట్రంలోని వర్సిటీల్లో ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తామన్నారు. రాష్ట్రంలోని వర్సిటీలు, పరిశోధన కేంద్రాలతో పిట్స్బర్గ్ వర్సిటీ అనుసంధానమై విద్యాపరిశోధనలు, విద్యాబోధన అంశాల అభివృద్ధికి సహకారం అందించనుందన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫె సర్ లింబాద్రి, వెంకటరమణ పాల్గొన్నారు. ఎంవోయూ అనంత రం పిట్స్బర్గ్ ప్రతినిధి బృందం సచివాలయంలో సీఎస్ ఎస్.కె.జోషి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మను మర్యాదపూర్వకంగా కలిసింది. -
'సుప్రీం తీర్పుపై అయోమయం వద్దు'
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఓకే ప్రవేశ పరీక్ష 'నీట్' కు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పుపై విద్యార్థులు అయోమయానికి గురికావాల్సిన పని లేదని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి స్పష్టం చేశారు. మే 2 న జరగాల్సిన తెలంగాణ ఎంసెట్ పరీక్ష యథాతధంగా ఉంటుందని ఆయన తెలిపారు. గురువారం సుప్రీం తీర్పుపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొన్న క్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు.