t.subbirami reddy
-
'ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే'
మహారాణిపేట : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభ సబార్డినేట్ కమిటీ చైర్మన్ టి.సుబ్బిరామిరెడ్డి డిమాండ్ చేశారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆధ్వర్యంలో ఆదివారం బీచ్‌రోడ్‌లోని ఓ హోటల్లో ‘ఆంధ్రాకు ప్రత్యేక హోదా- విశాఖ అభివృద్ధి’పై చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్ట విభజన చేసి నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన బీజేపీ ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టిందని విమర్శించారు. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీచేసిన టీడీపీ ప్రత్యేక హోదా అడగడానికి ఎందుకు వెనుకడుగువేస్తోందో అర్థం కావడంలేదన్నారు. రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అడ్డంకాదని రాజకీయాలకు అతీతంగా సహకరిస్తుందన్నారు. విశాఖకు రైల్వేజోన్ తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీలు ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. తమ హయాంలో చేసిన భూసంస్కరణల జీవోలను దొంగచాటుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కందాల-కృపారాణిల మధ్య వాగ్వాదం న్యాయవాది కందాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో కూడా భూ ఆక్రమణలు జరిగాయని చెప్పగా కృపారాణి జోక్యం చేసుకొని కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎక్కడ భూ ఆక్రమణలు జరిగాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కందాలను నిలదీశారు. దీంతో ఆయన వేదికపై నుంచి దిగిపోయారు. ఆయనతో వచ్చిన కొంతమంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఎస్సార్ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో సీపీఎం నేత గంగారామ్, సీపీఐ నేత బి.పైడిరాజు, కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు సిహెచ్.రాఘవేందర్రావు, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్.ఎస్.శివశంకర్, హ్యూమన్ రైట్స్ వేదిక ప్రతినిధి శ్యాంప్రసాద్, గ్రేటర్ విశాఖ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు నరవ రాంబాబు, ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ కన్వీనర్ జె.టి.రామారావు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, పేడాడ రమణకుమారి, గుంటూరు భారతి, తదితరులు పాల్గొన్నారు. -
‘గ్రేట్ ఉమెన్-2014’
-
సెంబ్‌కార్ప్‌కు ఎన్సీసీ పవర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఎన్సీసీ పవర్ ప్రాజెక్టులో మెజారిటీ వాటాను సింగపూర్‌కు చెందిన సెంబ్‌కార్ప్ దక్కించుకుంటోంది. దీన్లో ఎన్సీసీకి చెందిన 55% వాటాను రూ.460 కోట్లకు సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 1,320 మెగావాట్ల ఈ విద్యుత్ ప్రాజెక్టులో 55% వాటా నాగార్జున కన్స్ట్రక్షన్స్కు చెందిన ఎన్సీసీ చేతిలో ఉండగా... మిగిలిన 45% ఎంపీ టి.సుబ్బరామిరెడ్డికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ చేతిలో ఉంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ముత్తుకూరు వద్ద నిర్మిస్తున్న ఈ విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటిదాకా 35% పనులు పూర్తయ్యాయని, ప్రాజెక్టుకు మొత్తం రూ.1,800 కోట్ల రుణభారం ఉందని ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న కంపెనీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. ఈ డీల్‌కు సంబంధించిన ప్రాథమిక అవగాహనపై ఇరు సంస్థలూ బుధవారం సంతకాలు చేశాయని, మిగతా వ్యవహారాలన్నీ అనుకున్నట్లు పూర్తయితే డిసెంబర్ నెలాఖరులోగా అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆయన చెప్పారు. ఒకవైపు వ్యయం పెరిగిపోవటం, రూపాయి క్షీణించటం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎన్సీసీ ఇన్వెస్ట్ చేసిన రూ.460 కోట్లను తిరిగి చెల్లించటం ద్వారా దాని వాటాను సొంతం చేసుకోవటానికి సెంబ్‌కార్ప్ ముందుకొచ్చిందని, ముఖ్యంగా రుణభారం తగ్గుతుంది కనుక వాటా విక్రయానికి ఎన్సీసీ మొగ్గు చూపిందని తెలియవచ్చింది. ఈ ఒప్పందానికి అమర్‌చంద్ అండ్ మంగళదాస్ న్యాయ సేవలు అందిస్తుండగా, కేపీఎంజీ ఫైనాన్షియల్ అడ్వైజరీ సేవలను అందిస్తోంది. రూ.7,047 కోట్ల పెట్టుబడి అంచనాతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టులో ఎన్సీసీ తన వాటా కింద రూ.960 కోట్లు సమకూర్చాల్సి ఉండగా ఇంతవరకు రూ.460 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ప్రాజెక్టుకు రూ.1,800 కోట్ల రుణభారం ఉంది. ఎన్సీసీ తన వాటాను విక్రయించటంతో రూ.990 కోట్ల మేర రుణం కూడా సెంబ్‌కార్ప్‌కు బదిలీ అవుతుంది. ప్రాజెక్టులో యాజమాన్య హక్కు కోల్పోయినప్పటికీ దీనికి సంబంధించిన ఈపీసీ కాంట్రాక్టులను ఎన్‌సీసీనే నిర్వహిస్తుంది. ఇది 2015 నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా. ప్రాజెక్టుకు సంబంధించి ఇంతవరకూ బొగ్గు సరఫరా, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరగలేదు. దీని పక్కనే గాయత్రితో కలిసి సెంబ్‌కార్ప్ మరో విద్యుత్ ప్రాజెక్టును కలిగి ఉండటంతో ఈ ఒప్పందం సెంబ్‌కార్ప్‌కు లాభం చేకూరుస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.