టీవీ రిపేరంటూ తీసుకెళ్లి గొంతుకోశారు
పశ్చిమగోదావరి: టీవీ బాగు చేయాలని చెప్పి మెకానిక్‌ను బైక్‌పై తీసుకెళ్లిన దుండగులు గొంతు కోసి పరారయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం అల్లంపురం గ్రామానికి చెందిన టీవీ మెకానిక్ చల్లా నాగ వెంకట మురళిని ఇద్దరు దుండగులు టీవీ బాగు చేయాలని చెప్పి శనివారం రాత్రి బైక్‌పై ఎక్కించుకున్నారు. తణుకు రూరల్ మండలం ముద్దాపురం గ్రామానికి తీసుకెళ్లి గొంతు కోసి పరారయ్యారు.
స్థానికులు అతడ్ని తాడేపల్లి గూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.