ముజఫర్నగర్లో అల్లర్లు..20 మందికి గాయాలు
ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఒకే వర్గానికి చెందిన రెండు గ్రూపులు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో 20 మంది గాయపడ్డారు. అదనపు బలగాలతో పోలీసులు రంగంలోకి దిగారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ ప్రదీప్ గుప్తా తెలిపారు. మసీదులో చిన్నపిల్లలు చదువుకుంటున్న విషయంలో ఇరు గ్రూపుల మధ్య బేధాపిప్రాయాలు తలెత్తాయి. వివాదం ముదరడతో రాళ్లురువ్వుకున్నారని ఎస్పీ వెల్లడించారు.