twin murder
-
మరణ శిక్ష కోసం మళ్లీ హత్యలు
కొలంబియా: తామొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లయింది వారి పరిస్థితి. అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రానికి చెందిన 38 ఏళ్ల డెన్వర్ సైమన్స్, 28 ఏళ్ల జాకోబ్ ఫిలిప్ప్‌లకు రెండు వేర్వేరు జంట హత్యల కేసుల్లో రెండేసి యావజ్జీవ శిక్షలు పడ్డాయి. 2010, ఆ తర్వాత జరిగిన రెండు వేర్వేరు జంట హత్యల కేసులకు సంబంధించి 2015లో ఈ ఇద్దరు నేరస్థులకు రెండేసి జీవితఖైదులు పడ్డాయి. జైలు జీవితంలో భాగంగా వారిని కొలంబియాలోని ‘కిర్కిలాండ్ కరెక్షనల్ ఇనిస్టిట్యూట్’కు పంపించారు. కనీసం పెరోల్ కూడా లభించని జైలు జీవితం పట్ల వారికి విరక్తి పుట్టింది. అందుకు ఆ ఖైదీలు ఆత్మహత్యలకు పాల్పడకుండా మరణ శిక్షలు పొందాలనుకున్నారు. పథకం ప్రకారం వారు 2017లో విలియం స్క్రగ్స్ (44), జిమ్మీ హామ్ (56), జాసన్ కెల్లీ (35), జాన్ కింగ్ (52) అనే నలుగురు తోటి ఖైదీలను హత్య చేశారు. ఆ కేసును విచారించిన రిచ్మండ్ కౌంటీ కోర్టు వారికి దిమ్మ తిరిగి పోయే తీర్పు చెప్పింది. వారికి చెరి మరో నాలుగు యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది. వారికి మరణ శిక్షలు విధించరాదని, జైలు శిక్షలే విధించండని బాధితుల కుటుంబీకులు కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో కోర్టు ఆ మేరకే శిక్షలు విధించింది. మరణ శిక్షల కోసమే హత్యలు చేసినట్లు డెన్వర్ సైమన్స్, జాకోబ్ ఫిలిప్ప్‌లు చెప్పిన కారణంగా బాధితుల బంధువులు వారికి మరణ శిక్ష వద్దని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. -
ఆదోనిలో అన్నదమ్ముల హత్య
- వివాహేతర సంబంధమే కారణం - ఆదివారం రాత్రి అన్న కిడ్నాప్ - అడ్డుకోబోయిన అతని తమ్ముడిపై వేటకొడవళ్లతో దాడి - చికిత్స పొందుతూ మృతి - కిడ్నాప్ అయిన వ్యక్తి దారుణ హత్య - ఎమ్మిగనూరు సమీపంలో చంపేసి, శవాన్ని తగులబెట్టిన దుండగులు - ముగ్గురు నిందితుల గుర్తింపు ఆదోని టౌన్/ఎమ్మిగనూరు రూరల్: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన ఆదోనిలో చోటు చేసుకుంది. సోమవారం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు జంట హత్యల వివరాలను వెల్లడించారు. ఆదోని పట్టణంలోని విక్టోరియ పేటలో నివాసముంటున్న రాజు, లక్ష్మీ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు నాగేంద్ర (38) రైస్ మిల్లులో పని చేస్తున్నాడు. రెండో కుమారుడు నాగరాజు (34) బెంగళూరు ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. మూడో కుమారుడు నరేష్(32) ఇంటి పట్టునే ఉంటున్నాడు. నాగేంద్రకు భార్య, కుమార్తె ఉన్నారు. ఇతనికి అదే కాలనీకి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి భార్య శిరీషను మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో 2016లో అతనిపై వేధింపుల కేసు నమోదైంది. వివాహేతర సంబంధం మానుకోవాలని భార్య, బంధువులు చెబుతున్నా పెడచెవినా పెడుతూ వచ్చాడు. ఈ విషయం మహిళ ఇంట్లో తెలియడంతో నాగేంద్రను చంపేందుకు కుట్ర పన్నారు. అడ్డొచ్చిన తమ్ముడిని కడతేర్చారు.. ఆదివారం రాత్రి నాగేంద్ర భోజనం ముగించుకుని ఇంటి ముందు కూర్చున్నాడు. తూపాన్ వాహనంలో తెల్ల దుస్తులు ధరించిన కొందరు గుర్తు తెలియని అక్కడికి వచ్చి అతడిని బలవంతంగా వాహనంలోకి ఎక్కిస్తుండగా కేకలు వేశాడు. కొంత దూరంలో ఉన్న అతని తమ్ముడు నరేష్ అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి వాహనానికి అడ్డుగా నిలిచాడు. తమ అన్నను ఎక్కడికి తీసుకెళ్తారని ప్రశ్నించేలోగా దుండగులు కత్తులతో దాడి చేయడంతో కుప్పకూలి పోయాడు. వాహనం మాధవరం రోడ్డువైపు వేగంగా వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన నరేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఇతనికి వివాహం కాలేదు. చేతి కడియంతో మృతదేహం గుర్తింపు ఆదివారం రాత్రి కిడ్నాప్‌నకు గురైన బోయ నాగేంద్రను దుండగులు ఎమ్మిగనూరు మండల బనవాసి ఫారం ఎల్లెల్సీ కాల్వ దగ్గరకు తీసుకువచ్చి హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తించకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. శరీర భాగాలు పూర్తిగా కాలిపోయాయి, అయితే కుడిచేయి మాత్రం కాలలేదు. సోమవారం ఉదయం కాలువ గట్టుపై నుంచి పొలాలకు వెళ్తున్న రైతులు మృతదేహాన్ని గుర్తించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సీఐ జీ.ప్రసాద్, రూరల్ ఎస్ఐ వేణుగోపాల్‌లు సంఘటన స్థలానికి చేరుకొని çపరిశీలించారు. ఆదివారం రాత్రి ఆదోనిలో కిడ్నాప్ ఘటనపై వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు కావటం, పత్రికల్లో కథనాలు రావటంతో ఆదోని పోలీసులకు, బంధువులకు ఎమ్మిగనూరు పోలీసులు సమాచారం అందించారు. ఈ మేరకు ఆదోని త్రీ టౌన్ సీఐ చంద్రశేఖర్, వన్‌టౌన్ ఎస్ఐ మన్మధవిజయ్ మృతుడి బంధువులను సంఘటన స్థలం దగ్గరకు తీసుకువచ్చారు. కుడిచేయి కాలిపోకుండా ఉండటం, చేతికి వెండి కడియం, దారం ఉండటంతో గుర్తించారు. అనంతరం ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హత్యకు గల కారణాలు వివాహేతర సంబంధం అని అనుమానాలను బంధువులు వ్యక్తం చేస్తున్నారన్నారు. అదే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశామన్నారు. కేసును త్వరలోనే ఛేదిస్తాం: డీఎస్పీ అన్నదమ్ముల హత్య కేసును త్వరలో ఛేదిస్తాం. నిందితులను అరెస్ట్ చేసేందుకు 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాం. మృతుడు నాగేంద్ర భార్య, మామ ఈరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసులో ఈరన్న, రవి, సత్యనారాయణపై కేసు నమోదు చేశాం. ఈ ఘటనలో పది మంది నిందితుల వరకు పాల్గొని ఉండవచ్చు. -
మూడు బృందాలతో గాలింపు
గోవిందపల్లె ( శిరివెళ్ల ) గోవిందపల్లెలో జరిగిన జంట హత్య కేసులో నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ ఈశ్వరరెడ్డి అన్నారు. సోమవారం గ్రామంలోని బందోబస్తును పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు కోణాల్లో సమగ్రంగా విచారణ చేసి నిందితులను అతి త్వరలోనే పట్టుకుంటామన్నారు. దర్యాప్తు వేగంగా సాగుతుందని, ఈ దశలో వివరాలు వెల్లడించలేమన్నారు. నియోజక వర్గాలలో నాయకులకు కౌన్సెలింగ్ ఇస్తామని, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట సీఐ ప్రభాకరెడ్డి ఉన్నారు. -
గోవిందపల్లెలో జంట హత్యలు
- మాజీ ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి, అతని బామ్మర్ది శ్రీనివాసరెడ్డి దారుణహత్య శిరువెళ్ల/రుద్రవరం: మండలంలోని గోవిందపల్లె గ్రామం నుంచి మసీదుపురం వెళ్లే అడ్డరోడ్డులో శనివారం రాత్రి జంటహత్యలు కలకలం రేపాయి. ఘటనలో మండల వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎంపీపీ ఇందూరు ప్రభాకర్‌రెడ్డి(52), ఇతని బామ్మర్తి శ్రీనివాసరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి రోడ్డు పక్కనున్న పంట కాల్వలో పడేశారు. వీరిద్దరూ రోజులాగానే శనివారం రాత్రి వాకింగ్‌కు వెళ్లారు. ఇంటికి తిరిగొచ్చే సమయంలో ఈ హత్య జరిగినట్లు ఘటనా స్థలాన్ని బట్టి తెలుస్తోంది. అయితే వాకింగ్‌కు వెళ్లిన ఇద్దరూ చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ముందుగా శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేశారు. రింగ్ అవుతున్నా తీయకపోవడంతో ఆందోళన చెందారు. బంధువులతో కలిసి వెళ్లి చూడగా పంట కాల్వలో విగజీవులుగా కనిపించారు. శ్రీనివాసరెడ్డి మృతదేహంపై వరిగడ్డి కప్పి ఉండగా.. ప్రభాకర్‌రెడ్డి మృతదేహం కాల్వలో బోర్లా పడి ఉండటం గుర్తించారు. సీఐ ప్రభాకర్‌రెడ్డి, డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నేత గంగుల బిజేంద్రారెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఆయన డీఎస్పీతో ప్రత్యేకంగా మాట్లాడారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇదిలాఉండగా సుమారు 30 ఎళ్ల క్రితం ప్రభాకర్‌రెడ్డి తండ్రి నారాయణరెడ్డిని ఆళ్లగడ్డలో భూమా వర్గం హత్య చేయడం గమనార్హం. ఆ తర్వాత గ్రామంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకపోయినా తాజాగా జరిగిన జంట హత్యలు చర్చనీయాంశంగా మారాయి. గంగుల వర్గం ఇటీవల టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే.