Twinkle Lily
-
‘విద్యార్థులకంటే ఆవులకే రక్షణ ఉంది’
ముంబై : బాలీవుడ్ నటి, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియలో చురుగ్గా ఉంటూ.. సమకాలిన విషయాలపై స్పందిస్తారనే విషయం తెలిసిందే. తాజాగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నెలకొంటున్న ఆందోళనలపై ఆమె స్పందించారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో(జేఎన్‌యూ) ఆదివారం దుండగులు ముసుగులు ధరించి విద్యార్థులపై దాడిచేయగా.. తీవ్ర గాయాలపాలైన విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ట్వింకిల్ ఖన్నా ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. దేశంలో విద్యార్థుల కంటే ఆవులకే ఎక్కువ రక్షణ ఉన్నట్లు ఉందని ట్వింకిల్ ఖన్నా వ్యాఖ్యానించారు. భయపడుతూ బతకాలని ఎవరూ అనుకోవడం లేదని, హింసతో ప్రజలను అణచి వేయలేరని పేర్కొన్నారు. అలా చేయడం వల్ల నిరసనలు, ఆందోళనలు మరింత పెరుగుతాయని.. ఎక్కువ మంది రోడ్లపైకి వస్తారని ట్వింకిల్ ఖన్నా తెలిపారు. (ఈరోజు నా కూతురు.. రేపు మీపై కూడా..) జేఎన్‌యూలో దాడిని ఖండించిన బాలీవుడ్ తారలు India,where cows seem to receive more protection than students, is also a country that now refuses to be cowed down. You can’t oppress people with violence-there will be more protests,more strikes,more people on the street. This headline says it all. pic.twitter.com/yIiTYUjxKR — Twinkle Khanna (@mrsfunnybones) January 6, 2020 -
పల్లెటూరి ప్రేమకథ
నూతన నటుడు ఉదయ్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘గుర్తుకొస్తున్నాయి’. ట్వింకిల్ అగర్వాల్ కథానాయికగా నటì స్తున్నారు. రాజేష్ సి.హెచ్ దర్శకత్వంలో బంగార్రాజు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వ్యాపారవేత్త శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సాయి వెంకట్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజేష్ సి.హెచ్ మాట్లాడుతూ– ‘‘చాలా సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన నేను తొలిసారి దర్శకత్వం వహిస్తున్నాను. 1980 నాటి గ్రామీణ నేపథ్యంలో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. స్కూల్ డేస్‌లో పిల్లలు ఎలా ఉండేవారు? అప్పట్లో ఆటలు ఎలా ఉండేవి? ఆ పిల్లల మధ్య ప్రేమ ఎలా చిగురించేది... వంటి విషయాలు మా చిత్రంలో ఉంటాయి’’ అన్నారు. ‘‘నేను చేసిన షార్ట్ ఫిలిమ్స్ చూసిన బంగార్రాజుగారు ఈ చిత్రంలో ‘నువ్వే హీరో’ అనడంతో షాక్ అయ్యాను. టీనేజ్‌లో జరిగే సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది’’ అన్నారు ఉదయ్. ‘‘మే 1న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేస్తాం’’ అన్నారు బంగార్రాజు. ‘‘తెలుగులో ఇది నా తొలి చిత్రం’’ అన్నారు ట్వింకిల్ అగర్వాల్. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత ముత్యాల దుర్గాప్రసాద్, కెమెరామే¯Œ: శివ.కె, సంగీత దర్శకుడు మార్క్ ప్రశాంత్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: జీవీవీ సత్యనారాయణ. -
హాస్యభరితంగా ఇన్బా ట్వింకిల్ లిల్లీ
ఆరోగ్యానికి నవ్వును మించిన ఔషధం లేదంటారు.ప్రస్తుత పరిస్థితుల్లో మనిషికి నవ్వులు రువ్వించడం చాలా అవసరం. ఈ విషయంలో కొన్ని సినిమాలు వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పకతప్పదు. ఈ కోవలో వస్తున్న మరో చిత్రం ఇన్బా ట్వింకిల్ లిల్లీ. ఇంతకు ముందు కదం కదం వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన అప్పు మూవీస్ సంస్థ అందిస్తున్న తాజా చిత్రం ఇది. అదేవిధంగా శరత్‌కుమార్ నటించిన వైదీశ్వరన్ చిత్రాన్ని తెర కెక్కించన విద్యాధరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ బామ్మలకు కథలకు అవినాభావ సంబంధం ఉందన్నారు. కథలు కాలాన్ని అధిగమించడానికి బామ్మలే కారణం అన్నారు. అలాంటి ముగ్గురు బామ్మలు పండించే వినోదభరిత కథా చిత్రమే ఇన్బా ట్వింకిల్ లిల్లీ అన్నారు. ఇందులో ఇన్బగ నటి శరణ్య,ట్వింకిల్‌గా కోవైసరళ, లిల్లీగా కల్పన నటిస్తున్నారని తెలిపారు.వీరి మనవరాలిగా సలీమ్ చిత్రం ఫేమ్ అశ్విత నటిస్తున్నట్లు చెప్నారు. నేటి సాంకేతిక పరిజ్ఞానం గురించి ఏ మాత్రం అవగాహన లేని ముగ్గురు బామ్మలు ఒక సమస్యలో చిక్కుకున్న తమ మనవరాలిని అదే సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా రక్షించుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందే చిత్ర ఇతివృత్తం అన్నారు. అయితే చిత్రం ఆద్యంతం హాస్యపు జల్లులు కురిపిస్తుందన్నారు. ఇందులో మాఫియా లీడర్‌గా నాన్‌కడవుల్ రాజేంద్రన్ నటిస్తున్నారని, ఇతర ముఖ్యపాత్రల్ని కత్తి అనుక్రిష్ణ, మనోబాల పోషిస్తున్నారని తెలిపారు. ధరణ్ సంగాతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆరవ తేదీన మొదలెట్టి కంటిన్యూగా నిర్వహిస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.