
నూతన నటుడు ఉదయ్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘గుర్తుకొస్తున్నాయి’. ట్వింకిల్ అగర్వాల్ కథానాయికగా నటì స్తున్నారు. రాజేష్ సి.హెచ్ దర్శకత్వంలో బంగార్రాజు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వ్యాపారవేత్త శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సాయి వెంకట్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజేష్ సి.హెచ్ మాట్లాడుతూ– ‘‘చాలా సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన నేను తొలిసారి దర్శకత్వం వహిస్తున్నాను. 1980 నాటి గ్రామీణ నేపథ్యంలో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. స్కూల్ డేస్‌లో పిల్లలు ఎలా ఉండేవారు? అప్పట్లో ఆటలు ఎలా ఉండేవి? ఆ పిల్లల మధ్య ప్రేమ ఎలా చిగురించేది... వంటి విషయాలు మా చిత్రంలో ఉంటాయి’’ అన్నారు.
‘‘నేను చేసిన షార్ట్ ఫిలిమ్స్ చూసిన బంగార్రాజుగారు ఈ చిత్రంలో ‘నువ్వే హీరో’ అనడంతో షాక్ అయ్యాను. టీనేజ్‌లో జరిగే సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది’’ అన్నారు ఉదయ్. ‘‘మే 1న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తాం’’ అన్నారు బంగార్రాజు. ‘‘తెలుగులో ఇది నా తొలి చిత్రం’’ అన్నారు ట్వింకిల్ అగర్వాల్. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత ముత్యాల దుర్గాప్రసాద్, కెమెరామే¯Œ: శివ.కె, సంగీత దర్శకుడు మార్క్ ప్రశాంత్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: జీవీవీ సత్యనారాయణ.
Comments
Please login to add a commentAdd a comment