Two minors
-
మైనర్లను రేప్ చేసిన వ్యక్తికి జీవిత ఖైదు
న్యూఢిల్లీ: 7, 9 వయసులు ఉన్న ఇద్దరు మైనర్లపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడినందుకుగానూ 76 ఏళ్ల పూజారికి ఢిల్లీలోని ఓ కోర్టు జీవిత ఖైదు విధించింది. తీర్పు సందర్భంగా మెజిస్ట్రేట్ విజేత సింగ్ రావత్ మాట్లాడుతూ.. పవిత్రమైన గుడి ఆవరణలోనే పూజారి విశ్వ బంధు మైనర్లపై అత్యాచార పర్వం కొనసాగించాడని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల ఫలితంగా బాధితులైన మైనర్లు భవిష్యత్తుపై భయం పెట్టుకున్నారని తీర్పులో తెలిపారు. ఇలాంటి మృగాన్ని బయటకు వదిలేస్తే కోర్టు కూడా తన బాధ్యతలో విఫలమైనట్లే అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. విశ్వబంధుకు యావజ్జీవ ఖైదుతో పాటు రూ. 60 వేల జరిమానా విధించారు. బాధితులకు రూ. 7.5 లక్షల చొప్పున సాయం అందించాలని ఆదేశించారు. -
అక్కాచెల్లెళ్లపై అత్యాచారం
కర్నూలు : పదవ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలోని కల్లూరు మండల కేంద్రానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు మూడేళ్ల కిందట తిరుపతికి వెళ్లారు. అక్కడ వారికి ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు. రాఖీపౌర్ణమి నాడు కల్లూరుకు వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు బాలికలతో రాఖీ కట్టించుకుని వారిని అనంతపురం జిల్లా వజ్రకరూర్కు తీసుకెళ్లారు. అక్కడ వారిని నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను వజ్రకరూర్కు చెందిన వినోద్, మహేష్లుగా గుర్తించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
మూడేళ్ల చిన్నారిపై మైనర్ల అత్యాచారం
దత్తిరాజేరు (విజయనగరం) : మూడేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో గురువారం చోటుచేసుకుంది. మండలంలోని ఇంగిలాపల్లి గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
రెచ్చిపోయిన మృగాళ్లు......
సాక్షి, బెంగళూరు : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మైనర్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చాయి. రెండు ఘటనలకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... స్థానిక జేపీనగర్‌లోని రాగిగుడ్డ వద్ద తన అవ్వతో కలిసి ఉంటున్న బాలిక(14)... స్థానికంగా కూరగాయల వ్యాపారం చేస్తున్న అసైతో స్నేహంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో అసై బుధవారం రాత్రి బాలికను తీసుకుని దగ్గరలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంటు వద్దకు వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన అతని అతని స్నేహితులు సంతోష్, అజయ్ వెంబడించారు. అనంతరం ముగ్గురు యువకులు కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక ఇంటికి వచ్చి విషయాన్ని అవ్వతో పాటు చుట్టుపక్కల వారికి తెలియజేసింది. స్థానికుల సూచనమేరకు బాలిక, అవ్వ దగ్గరల్లో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు నగరంలోనే వేర్వేరు చోట్ల ఉన్న ముగ్గురు యువకులను గురువారం ఉదయం అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా ఈ ముగ్గురు యువకులు మూలతహా తమిళనాడుకు చెందినవారుగా తెలుస్తోంది. మరోఘటనలో కుణిగల్ తాలూకా చిక్కాపురకు చెందిన గిరీష్‌కు స్థానిక లక్కేనహళ్లిలో ఉంటూ పదోతరగతి చదువుతున్న బాలిక (15) సెల్ఫోన్లో పరిచయమైంది. ఈ నేపథ్యంలో తన స్నేహితులైన గంగరాజు, కెంపరాజుతో కలిసి గత సోమవారం బాలిక చదువుతున్న పాఠశాల వద్దకు గిరీష్ కారులో వచ్చాడు. బాలికను కారులో ఇంటి వద్దకు తీసుకు వెళతానని నమ్మించాడు. అనంతరం కారులో కొంత దూరం వెళ్లాక నిర్జన ప్రదేశంలో కారు చెడిపోయిందని నాటకం ఆడి, ఇద్దరు స్నేహితులు మెకానిక్‌ను తీసుకురావడానికి వెళ్లగా గిరిష్ బాలికపై అత్యాచారం చేశాడు. కొద్ది సేపటి తర్వాత మెకానిక్ రావడం లేదని గంగరాజు, కెంపరాజు తిరిగి వచ్చేశారు. తర్వాత కారును వివిధ చోట్ల తిప్పుతూ సోమవారం మొత్తం బాలికపై పలుమార్లు ముగ్గురు సాముహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం మంగళవారం ఉదయం బాలికను ఇంటివద్ద దిగబెట్టి వెళ్లిపోయారు. మొదట్లో ఎవరికీ చెప్పకపోయినా తర్వాత తనపై జరిగిన దారుణాన్ని ఇంట్లోని వాళ్లకు, చుట్టుపక్కలను బాలిక చెప్పి బోరున విలపించింది. వారి సూచనల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.