రెచ్చిపోయిన మృగాళ్లు...... | Three boys raped two minor girls | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన మృగాళ్లు......

Published Fri, Jun 19 2015 5:29 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

రెచ్చిపోయిన మృగాళ్లు...... - Sakshi

రెచ్చిపోయిన మృగాళ్లు......

సాక్షి, బెంగళూరు :  వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మైనర్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చాయి. రెండు ఘటనలకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు...  స్థానిక జేపీనగర్‌లోని రాగిగుడ్డ వద్ద తన అవ్వతో కలిసి ఉంటున్న బాలిక(14)... స్థానికంగా కూరగాయల వ్యాపారం చేస్తున్న అసైతో స్నేహంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో అసై బుధవారం రాత్రి బాలికను తీసుకుని దగ్గరలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంటు వద్దకు వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన అతని అతని స్నేహితులు సంతోష్, అజయ్ వెంబడించారు.

అనంతరం ముగ్గురు యువకులు కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక ఇంటికి వచ్చి విషయాన్ని అవ్వతో పాటు చుట్టుపక్కల వారికి తెలియజేసింది. స్థానికుల సూచనమేరకు బాలిక, అవ్వ దగ్గరల్లో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు నగరంలోనే వేర్వేరు చోట్ల ఉన్న ముగ్గురు యువకులను గురువారం ఉదయం  అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా ఈ ముగ్గురు యువకులు మూలతహా తమిళనాడుకు చెందినవారుగా తెలుస్తోంది.
 
మరోఘటనలో కుణిగల్ తాలూకా చిక్కాపురకు చెందిన గిరీష్‌కు స్థానిక లక్కేనహళ్లిలో ఉంటూ పదోతరగతి చదువుతున్న బాలిక (15)  సెల్‌ఫోన్‌లో పరిచయమైంది. ఈ నేపథ్యంలో తన స్నేహితులైన గంగరాజు, కెంపరాజుతో కలిసి గత సోమవారం బాలిక చదువుతున్న పాఠశాల వద్దకు గిరీష్  కారులో వచ్చాడు. బాలికను కారులో ఇంటి వద్దకు తీసుకు వెళతానని నమ్మించాడు. అనంతరం కారులో కొంత దూరం వెళ్లాక నిర్జన ప్రదేశంలో కారు చెడిపోయిందని నాటకం ఆడి, ఇద్దరు స్నేహితులు మెకానిక్‌ను తీసుకురావడానికి వెళ్లగా గిరిష్ బాలికపై అత్యాచారం చేశాడు. కొద్ది సేపటి తర్వాత మెకానిక్ రావడం లేదని గంగరాజు, కెంపరాజు తిరిగి వచ్చేశారు.
 
తర్వాత కారును వివిధ చోట్ల తిప్పుతూ సోమవారం మొత్తం బాలికపై పలుమార్లు ముగ్గురు సాముహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం మంగళవారం ఉదయం బాలికను ఇంటివద్ద దిగబెట్టి వెళ్లిపోయారు. మొదట్లో ఎవరికీ చెప్పకపోయినా తర్వాత తనపై జరిగిన దారుణాన్ని ఇంట్లోని వాళ్లకు, చుట్టుపక్కలను బాలిక చెప్పి బోరున విలపించింది. వారి సూచనల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం  అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement