అక్కాచెల్లెళ్లపై అత్యాచారం | Two minors raped | Sakshi
Sakshi News home page

అక్కాచెల్లెళ్లపై అత్యాచారం

Published Tue, Sep 8 2015 3:21 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

అక్కాచెల్లెళ్లపై అత్యాచారం - Sakshi

అక్కాచెల్లెళ్లపై అత్యాచారం

కర్నూలు : పదవ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలోని కల్లూరు మండల కేంద్రానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు మూడేళ్ల కిందట తిరుపతికి వెళ్లారు. అక్కడ వారికి ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు.

రాఖీపౌర్ణమి నాడు కల్లూరుకు వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు బాలికలతో రాఖీ కట్టించుకుని వారిని అనంతపురం జిల్లా వజ్రకరూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ వారిని నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను వజ్రకరూర్కు చెందిన వినోద్, మహేష్లుగా గుర్తించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement