udacity nanodegree
-
సెల్ఫ్ డ్రైవింగ్ ఇంజనీరింగ్‌లో ఉద్యోగులకు శిక్షణ
సాక్షి, బెంగళూరు: దేశీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు సెల్ఫీ డ్రైవింగ్ కార్ ఇంజనీరింగ్‌పై గ్లోబల్ శిక్షణా సంస్థ ఆధర్వంలో ట్రైనింగ్ ఇప్పించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు అమెరికాకు చెందిన ఐటి ఆన్‌లైన లెర్నింగ్ సంస్థ ఉడాసిటీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సెల్ఫీ డ్రైవింగ్ కార్ ఇంజనీరింగ్ పై ఉద్యోగుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆన్ లైన్ నానో డిగ్రీ శిక్షణకు శ్రీకారం చుట్టింది. ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఉడాసిటీ ఉడాసిటీ కనెక్ట్ పేరుతో అందిస్తున్న నానో డిగ్రీ శిక్షణ 20వారాలు పాటు కొనసాగుతుంది. దీని ద్వారా 2018 నాటికి సుమారు 500మందికి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ఇంజనీరింగ్ టెక్నాలజీస్‌పై అత్యాధునిక తర్ఫీదు నివ్వనుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అటానమస్ టెక్నాలజీస్లోతమ ఉద్యోగుల నైపుణ్యాల పునరుద్ధరణకు తాము కట్టుబడి ఉన్నామని ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్, డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవి కుమార్ తెలిపారు. ఉడాసిటీతో భాగస్వామ్యం తమకు గర్వకారణమనీ.. తద్వారా నూతన ఆవిష్కరణలోల తాము ముందంజలో ఉన్నామనే నమ్మకాన్ని తమ ఖాతాదారులకు అందించనున్నట్టు ఆయన చెప్పారు. -
ఇంటర్వ్యూ లేకుండానే ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు!
ఎంఎన్సీలలో ఉద్యోగాలు రావాలంటే చిన్న విషయం కాదు. నాలుగైదు ఫేజులలో ఇంటర్వ్యూలు, హెచ్ఆర్ రౌండు.. ఇవన్నీ ఉంటాయి. కానీ, తొలిసారిగా ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఇంటర్వ్యూలు లేకుండా ఉద్యోగాల్లోకి తీసుకుంటోంది. అయితే అందరినీ మాత్రం కాదు. ఉడాసిటీ వాళ్ల ప్రోగ్రాంలు పూర్తిచేసినవాళ్లనే ఇలా ఇంటర్వ్యూ ప్రసక్తి లేకుండానే ఉద్యోగంలోకి తీసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఉడాసిటీ అనేది ఒక ఆన్లైన్ లెర్నింగ్ కంపెనీ. అందులో నానో డిగ్రీ ప్రోగ్రాంలు నిర్వహిస్తారు. ఇవి పూర్తి చేసిన వాళ్లకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు గానీ, గ్రూప్ డిస్కషన్లు గానీ ఏమీ అక్కర్లేదని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. దీంతో నియామకాల విషయంలో చేయాల్సిన భారీ కసరత్తు తగ్గిపోతుందని, చాలా సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. పరిశ్రమకు కావల్సిన అవసరాలేంటో ముందుగానే తెలుసుకుని ఆ ప్రకారమే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని ఉద్యోగాలకు సిద్ధంగా చేయడం.. తద్వారా వాళ్లు నేరుగా ఉద్యోగాల్లో ప్రవేశించడం సాధ్యం అవుతున్నాయి. ఇలా ఇప్పటికే ముగ్గురు విద్యార్థులను ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగాల్లోకి తీసుకోగా, వాళ్లు మొబైల్ డెవలప్మెంట్ టీమ్‌లో పనిచేయడం ప్రారంభించారు.