ఇంటర్వ్యూ లేకుండానే ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు! | flipkart offers jobs without interviews | Sakshi
Sakshi News home page

ఇంటర్వ్యూ లేకుండానే ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు!

Published Thu, Jan 28 2016 6:34 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

ఇంటర్వ్యూ లేకుండానే ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు! - Sakshi

ఇంటర్వ్యూ లేకుండానే ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు!

ఎంఎన్‌సీలలో ఉద్యోగాలు రావాలంటే చిన్న విషయం కాదు.  నాలుగైదు ఫేజులలో ఇంటర్వ్యూలు, హెచ్ఆర్ రౌండు.. ఇవన్నీ ఉంటాయి. కానీ, తొలిసారిగా ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఇంటర్వ్యూలు లేకుండా ఉద్యోగాల్లోకి తీసుకుంటోంది. అయితే అందరినీ మాత్రం కాదు. ఉడాసిటీ వాళ్ల ప్రోగ్రాంలు పూర్తిచేసినవాళ్లనే ఇలా ఇంటర్వ్యూ ప్రసక్తి లేకుండానే ఉద్యోగంలోకి తీసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఉడాసిటీ అనేది ఒక ఆన్‌లైన్ లెర్నింగ్ కంపెనీ. అందులో నానో డిగ్రీ ప్రోగ్రాంలు నిర్వహిస్తారు. ఇవి పూర్తి చేసిన వాళ్లకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు గానీ, గ్రూప్ డిస్కషన్లు గానీ ఏమీ అక్కర్లేదని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

దీంతో నియామకాల విషయంలో చేయాల్సిన భారీ కసరత్తు తగ్గిపోతుందని, చాలా సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. పరిశ్రమకు కావల్సిన అవసరాలేంటో ముందుగానే తెలుసుకుని ఆ ప్రకారమే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని ఉద్యోగాలకు సిద్ధంగా చేయడం.. తద్వారా వాళ్లు నేరుగా ఉద్యోగాల్లో ప్రవేశించడం సాధ్యం అవుతున్నాయి. ఇలా ఇప్పటికే ముగ్గురు విద్యార్థులను ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగాల్లోకి తీసుకోగా, వాళ్లు మొబైల్ డెవలప్‌మెంట్ టీమ్‌లో పనిచేయడం ప్రారంభించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement