Udaipur district
-
టీమిండియాపై పాక్ గెలుపు.. సంబురాలు చేసుకున్న టీచర్ తొలగింపు
Teacher Expresses Joy Over Pakistan Win Against India Gets Expelled: టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియాపై పాక్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన నఫీసా అత్తారి అనే ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు.. పాక్ క్రికెట్ జట్టు విజయం అనంతరం సంబురాలు చేసుకుని ఉద్యోగాన్ని కోల్పోయింది. స్థానికంగా ఉండే నీర్జా మోదీ అనే స్కూల్లో పనిచేసే నఫీసా.. పాక్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తన వాట్సాప్‌లో స్టేటస్ పెట్టింది. ఇందులో 'మేం గెలిచాం' అంటూ పాక్ ఆటగాళ్ల ఫోటోలు ఉంచింది. ఇది గమనించిన విద్యార్ధుల తల్లిదండ్రుల్లోని ఒకరు మీరు పాక్‌కు మద్దతిస్తున్నారా అని నఫీసాను ప్రశ్నించగా.. ఆమె అవునని సమాధానం చెప్పింది. దీంతో చిర్రెత్తిపోయిన సదరు తల్లిదండ్రులు..నఫీసా వాట్సాప్ స్టేటస్ స్క్రీన్షాట్లను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్త వైరల్ కావడంతో పాఠశాల యాజమాన్యం నఫీసాను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ మేరకు టెర్మినేషన్ లెటరును జారీ చేసింది. ఇది కూడా వైరల్ కావడంతో సర్వత్రా దీనిపై చర్చ నడుస్తుంది. చదవండి: T20 WC 2021: పాక్ విజయంపై ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
భార్య, ప్రియుడిని నగ్నంగా ఊరేగించి..
ఉదయ్‌పూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో దుశ్శాసనపర్వం చోటుచేసుకుంది. భర్తను వదిలి ప్రియుడితో పారిపోయిన మహిళను దారుణంగా అవమానించారు. భర్త, ఆయన కుటుంబ సభ్యులు, గామస్తులు కలసి.. గిరిజన తెగకు చెందిన ఆ యువతిని, ప్రియుడిని పట్టుకుని వచ్చి నగ్నంగా ఊరేగించారు. ఆ తర్వాత ఇద్దరినీ అలాగే రెండు రోజుల పాటు కట్టేసి చిత్ర హింసలు పెట్టారు. కొందరు యువకులు వారి ఫొటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కసోటియా గ్రామంలో గత సోమవారం ఈ దారుణం జరిగింది. ప్రభుత్వ కార్యాలయం, స్కూలుకు సమీపంలోనే ఈ సంఘటన జరిగింది. స్కూలు టీచర్లు, వైద్య సిబ్బంది ఈ దృశ్యాలను చూసినా ఎవరూ అధికారులకు ఫిర్యాదు చేయలేదు. యువతి ప్రియుడు లాలూరామ్ కుటుంబ సభ్యులు గ్రామస్తులకు 80 వేల రూపాయలు చెల్లించడంతో రెండు రోజుల తర్వాత అతణ్ని విడిచిపెట్టారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చాక శుక్రవారం బాధిత మహిళను రక్షించారు. మహిళ భర్త, ముగ్గురు మహిళలతో సహా 13 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ గ్రామ పట్వారీని జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరణ ఇవ్వాల్సిందిగా టీచర్లను, వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఉదయ్‌పూర్ ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గోయల్ గ్రామంలో పోలీసు క్యాంపు ఏర్పాటు చేశారు.