భార్య, ప్రియుడిని నగ్నంగా ఊరేగించి.. | Woman, lover tied together naked in public for 2 days | Sakshi
Sakshi News home page

భార్య, ప్రియుడిని నగ్నంగా ఊరేగించి..

Published Sat, Jun 25 2016 10:21 AM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

భార్య, ప్రియుడిని నగ్నంగా ఊరేగించి..

భార్య, ప్రియుడిని నగ్నంగా ఊరేగించి..

ఉదయ్పూర్: రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలో దుశ్శాసనపర్వం చోటుచేసుకుంది. భర్తను వదిలి ప్రియుడితో పారిపోయిన మహిళను దారుణంగా అవమానించారు. భర్త, ఆయన కుటుంబ సభ‍్యులు, గామస్తులు కలసి.. గిరిజన తెగకు చెందిన ఆ యువతిని, ప్రియుడిని పట్టుకుని వచ్చి నగ్నంగా ఊరేగించారు. ఆ తర్వాత ఇద్దరినీ అలాగే రెండు రోజుల పాటు కట్టేసి చిత్ర హింసలు పెట్టారు. కొందరు యువకులు వారి ఫొటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కసోటియా గ్రామంలో గత సోమవారం ఈ దారుణం జరిగింది.

ప్రభుత్వ కార్యాలయం, స్కూలుకు సమీపంలోనే ఈ సంఘటన జరిగింది. స్కూలు టీచర్లు, వైద్య సిబ్బంది ఈ దృశ్యాలను చూసినా ఎవరూ అధికారులకు ఫిర్యాదు చేయలేదు. యువతి ప్రియుడు లాలూరామ్ కుటుంబ సభ్యులు గ్రామస్తులకు 80 వేల రూపాయలు చెల్లించడంతో రెండు రోజుల తర్వాత అతణ్ని విడిచిపెట్టారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చాక శుక్రవారం బాధిత మహిళను రక్షించారు. మహిళ భర్త, ముగ్గురు మహిళలతో సహా 13 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ గ్రామ పట్వారీని జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరణ ఇవ్వాల్సిందిగా టీచర్లను, వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఉదయ్పూర్ ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గోయల్ గ్రామంలో పోలీసు క‍్యాంపు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement