Ulavacharu Biriyani
-
రాజుగారి కోడి పలావు
ఆ టేస్టే వేరు: ‘రాజుగారి కోడి పలావు కేరాఫ్ ఉలవచారు’... ఇదేమీ సినిమా టైటిల్ కాదు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-68లోని ‘ఉలవచారు’ రెస్టారెంట్లో ఫేమస్ డిష్. హైదరాబాద్ బిర్యానీకి దీటుగా కొత్తగా తెరపైకి వచ్చిన రాజుగారి కోడి పలావు భోజనప్రియులకు చవులూరిస్తోంది. దీనిని పద్ధతిగా అరిటాకులో వడ్డించడం మరో ప్రత్యేకత.. సెలబ్రిటీల ఫేవరెట్... రాజుగారి కోడి పలావుకు పలువురు సెలబ్రిటీలు అభిమానులుగా మారారు. మణిరత్నం, లక్ష్మి మంచు, సమంతా, కోన వెంకట్, వెన్నెల కిశోర్, రానా, వీవీ వినాయక్ వంటి సినీ ప్రముఖులంతా రాజుగారి కోడి పలావు కోసమే ‘ఉలవచారు’ రెస్టారెంట్‌కు వస్తుంటారు. ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేయడానికి సిటీలో ఇది బెస్ట్ హ్యాంగౌట్ ప్లేస్ అని ఇక్కడకు వచ్చిన హీరో ఆది చెప్పారు. తాను ఇక్కడకు ఎప్పుడు వచ్చినా, స్టార్టర్‌గా బంగ్లా చికెన్ ఆర్డర్ చేస్తానని, బంగ్లా చికెన్‌తో మొదలయ్యే భోజనం, రాజుగారి కోడి పలావుతో ముగుస్తుందని అన్నారు. అంతా స్టీమ్తోనే... ‘ఇది పూర్తిగా స్టీమ్బేస్డ్ బిర్యానీ. చికెన్ తప్ప ఇందులో నూనెలేవీ వాడం. కాస్త నెయ్యి, కొద్దిగా మసాలా వాడతాం. ఫ్లేవర్ కోసం పచ్చిమిర్చి తప్ప మరేమీ వాడం’ అని ‘ఉలవచారు’ ఎండీ ఎన్.వినయ్‌కుమార్ రెడ్డి చెప్పారు. తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలతో కూడిన రాజుగారి కోడి పలావును ఎవరైనా ఆర్డర్ చేసినప్పుడు మాత్రమే తయారు చేస్తామని ఆయన తెలిపారు. దీనికి కాంబినేషన్‌గా గోంగూర గ్రేవీ, స్పైసీ చట్నీ, రైతా వడ్డిస్తామని, వాటితో పాటు కాంప్లిమెంటరీగా దద్దోజనం, చిప్స్ అందిస్తామని చెప్పారు. - సాక్షి, సిటీప్లస్ -
ఇళయరాజా ఆ మాట అనగానే సంబరపడిపోయా!
మానవ బంధాల చుట్టూ అల్లుకున్న కథ: మలయాళ సినిమా ‘సాల్ట్ అండ్ పెప్పర్’ నన్ను ఎంతో ఆకట్టుకుంది. వెంటనే హక్కుల్ని తీసుకున్నాను. ఆ కథకు నా అనుభవాలను జోడించి సరికొత్తగా ‘ఉలవచారు బిరియాని’ని తీర్చిదిద్దాను. ప్రకాశ్‌రాజ్ సినిమా అంటే కొన్ని అంచనాలు ఉంటాయి. వాటికి తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది.ఆ పేరు పెట్టింది అందుకే: ప్రేమను వ్యక్తపరచడంలో వంటకాన్ని మించిన సాధనం లేదు. అమ్మ చేతి వంటతో అందరికీ ఏ పవిత్రమైన బంధం ఉంటుంది. అలాగే ఓ ప్రాంతానికి చెందిన వంట.. అక్కడి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. భార్య భర్తకు ఇష్టమైన వంట చేసిపెడితే...‘ఏంటి విశేషం’ అని అడుగుతాడు. అలాగే... కోపాన్ని వ్యక్తం చేయడానిక్కూడా పళ్లాన్నే విసిరి కొడతాడు. అలా భావోద్వేగాల్లో వంట పాత్ర చాలా ఉంటుంది. అందుకే ఈ సినిమాకు ‘ఉలవచారు బిర్యాని’ అని పేరు పెట్టాం. ఇళయరాజా తన సంగీతంతో దీవించారు: ‘ఇద్దరు, అంతఃపురం, బొమ్మరిల్లు‘ సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఎంత తీవ్రతతో ఆ పాత్రలను పోషించానో, అంతే తీవ్రతతో ఈ పాత్ర చేశాను. ఇక దర్శకునిగా ఏ మేరకు సక్సెస్ అయ్యానో రేపు ప్రేక్షకులే చెప్పాలి. ఇళయరాజా తన సంగీతంతో నా సినిమాను దీవించారు. ‘చాలా కాలం తర్వాత మంచి నేపథ్య సంగీతం అందించడానికి వీలున్న సినిమా ఇచ్చావురా’ అని రాజాగారు అన్నప్పుడు సంబరపడిపోయా. ఆయన భాగస్వామ్యం గర్వకారణం: తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని మలిచాను. మంచి సాంకేతిక నిపుణులు దొరకడంతో తేలిగ్గా పూర్తి చేయగలిగాను. స్నేహ, ఊర్వశిల నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. కొత్తగా పరిచయమవుతున్న తేజస్, సంయుక్త బాగా నటించారు. కేఎస్ రామారావు లాంటి గొప్ప నిర్మాత భాగస్వామ్యంలో తెలుగులో ఈ చిత్రాన్ని అందిస్తున్నందుకు గర్విస్తున్నాను. ఈ తరం క్యారెక్టర్ నటుల్లో ప్రకాశ్‌రాజ్‌ది ప్రత్యేక స్థానం. సరైన పాత్ర చేతికి వస్తే... ప్రకాశ్‌రాజ్ ధాటిని తట్టుకోవడం ఎదుటివారికి సవాలే. నటనతో పాటు మరో పక్క దర్శకునిగానూ రాణిస్తున్నారాయన. అందుకు ‘ధోని’ చిత్రం ఓ ఉదాహరణ. ఇప్పుడు జూన్ 6న ఆయన దర్శకత్వం వహించిన ‘ఉలవచారు బిర్యాని’ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ చెప్పిన ముచ్చట్లు...