ఇళయరాజా ఆ మాట అనగానే సంబరపడిపోయా! | Ulavacharu Biriyani to release on June 6th | Sakshi
Sakshi News home page

ఇళయరాజా ఆ మాట అనగానే సంబరపడిపోయా!

Published Tue, May 27 2014 10:23 PM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

ఇళయరాజా ఆ మాట అనగానే సంబరపడిపోయా!

ఇళయరాజా ఆ మాట అనగానే సంబరపడిపోయా!

  మానవ బంధాల చుట్టూ అల్లుకున్న కథ: మలయాళ సినిమా ‘సాల్ట్ అండ్ పెప్పర్’ నన్ను ఎంతో ఆకట్టుకుంది. వెంటనే హక్కుల్ని తీసుకున్నాను. ఆ కథకు నా అనుభవాలను జోడించి సరికొత్తగా ‘ఉలవచారు బిరియాని’ని తీర్చిదిద్దాను. ప్రకాశ్‌రాజ్ సినిమా అంటే కొన్ని అంచనాలు ఉంటాయి. వాటికి తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది.ఆ పేరు పెట్టింది అందుకే: ప్రేమను వ్యక్తపరచడంలో వంటకాన్ని మించిన సాధనం లేదు. అమ్మ చేతి వంటతో అందరికీ ఏ పవిత్రమైన బంధం ఉంటుంది.
 
 అలాగే ఓ ప్రాంతానికి చెందిన వంట.. అక్కడి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. భార్య భర్తకు ఇష్టమైన వంట చేసిపెడితే...‘ఏంటి విశేషం’ అని అడుగుతాడు. అలాగే... కోపాన్ని వ్యక్తం చేయడానిక్కూడా పళ్లాన్నే విసిరి కొడతాడు. అలా భావోద్వేగాల్లో వంట పాత్ర చాలా ఉంటుంది. అందుకే ఈ సినిమాకు ‘ఉలవచారు బిర్యాని’ అని పేరు పెట్టాం.  ఇళయరాజా తన సంగీతంతో దీవించారు: ‘ఇద్దరు, అంతఃపురం, బొమ్మరిల్లు‘ సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఎంత తీవ్రతతో ఆ పాత్రలను పోషించానో, అంతే తీవ్రతతో ఈ పాత్ర చేశాను.
 
 ఇక దర్శకునిగా ఏ మేరకు సక్సెస్ అయ్యానో రేపు ప్రేక్షకులే చెప్పాలి. ఇళయరాజా తన సంగీతంతో నా సినిమాను దీవించారు. ‘చాలా కాలం తర్వాత మంచి నేపథ్య సంగీతం అందించడానికి వీలున్న సినిమా ఇచ్చావురా’ అని రాజాగారు అన్నప్పుడు సంబరపడిపోయా.  ఆయన భాగస్వామ్యం గర్వకారణం: తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని మలిచాను. మంచి సాంకేతిక నిపుణులు దొరకడంతో తేలిగ్గా పూర్తి చేయగలిగాను. స్నేహ, ఊర్వశిల నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. కొత్తగా పరిచయమవుతున్న తేజస్, సంయుక్త  బాగా నటించారు. కేఎస్ రామారావు లాంటి గొప్ప నిర్మాత భాగస్వామ్యంలో తెలుగులో ఈ చిత్రాన్ని అందిస్తున్నందుకు గర్విస్తున్నాను.
 
 ఈ తరం క్యారెక్టర్ నటుల్లో ప్రకాశ్‌రాజ్‌ది ప్రత్యేక స్థానం. సరైన పాత్ర చేతికి వస్తే... ప్రకాశ్‌రాజ్ ధాటిని తట్టుకోవడం ఎదుటివారికి సవాలే. నటనతో పాటు మరో పక్క దర్శకునిగానూ రాణిస్తున్నారాయన. అందుకు ‘ధోని’ చిత్రం ఓ ఉదాహరణ. ఇప్పుడు జూన్ 6న ఆయన దర్శకత్వం వహించిన ‘ఉలవచారు బిర్యాని’ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ చెప్పిన ముచ్చట్లు...
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement