ఎర్రచందనం స్వాధీనం: అయిదురురు స్మగ్లర్ల అరెస్ట్
కడప: రైల్వేకోడూరు మండలం ఊల్లగట్టుపోడు వద్ద అయిదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న 20 లక్షల రూపాయల విలువ గల ఎర్ర చందనం, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల చిత్తూరు, కడప జిల్లాలలో ఎర్రచందనం అక్రమ రవాణా అధికమైందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎర్రచందనం స్మగ్లర్ల అఘాయిత్యాలు కూడా ఎక్కువైపోయాయి. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఈ నెల15 ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునేందుకు వెళ్లిన ఇద్దరు అటవీ ఉద్యోగులు హత్యకు గురైన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నవారి అండతోనే స్మగ్లర్లు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.