'జీవో 97ను వెనక్కి తీసుకోవాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 97ను వెంటనే వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకు అన్యాయం చేసేలా ఉన్నటువంటి ఈ జీవోను ఉపసంహరించకుండా ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తుందన్నారు. బాక్సైట్ తవ్వకాలను అనుకూలంగా మార్చుకోవడానికే కొత్తపల్లి గీతను టీడీపీలో చేర్చుకున్నారని ఆయన విమర్శించారు. ఇటీవల మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదంటూ కేంద్రమంత్రి సుజనాచౌదరి వ్యాఖ్యలను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తప్పుపట్టారు.