UMPP
-
‘తిలయా’ నుంచి తప్పుకున్న రిలయన్స్ పవర్
న్యూఢిల్లీ: జార్ఖండ్ రాష్ట్రంలోని తిలయా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు (యూఎంపీపీ) నుంచి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ తప్పుకుంది. తన వాటాను రూ.712.64 కోట్ల మొత్తానికి వదులుకుంది. ఇందులో రూ.600 కోట్ల బ్యాంకు గ్యారంటీలు కాగా మిగిలిన రూ.112.64 కోట్లను రిలయన్స్ పవర్‌కు జార్ఖండ్ ఉర్జా వికాస్ నిగమ్ (జేయూవీఎన్) లిమిటెడ్ చెల్లిస్తుంది. దీంతో ఆర్‌పవర్ వాటా జేయూవీఎన్ పరమయింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం యూఎంపీసీ నుంచి కూడా తప్పుకోవాలనుకుంటున్నట్టు అనిల్ గత సెప్టెంబర్‌లో జరిగిన కంపెనీ ఏజీఎంలో వెల్లడించారు. ఇందులో భాగంగా ఇటీవల ఆయన ఏపీ సీఎం చంద్రబాబును కలిసి మాట్లాడారు కూడా. కృష్ణపట్నం నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తును ఏపీ, తమిళనాడు, మహరాష్ట్ర, కర్ణాటకలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఆర్ పవర్‌కు 3 యూఎంపీపీలను ఇవ్వగా ‘సన్సా’ ఒక్కటే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
బొగ్గు ధరలపై విజయ్‌సాయిరెడ్డి సూటి ప్రశ్న
న్యూఢిల్లీ: దిగుమతి చేసుకుంటున్న బొగ్గు ధరల హెచ్చుతగ్గుల నుంచి ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్లను బయటపడేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందా లేదా అని బొగ్గు శాఖమంత్రిని రాజ్యసభలో వైఎస్సార్సీపీ నేత విజయ్ సాయి రెడ్డి ప్రశ్నించారు. ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్ల(యూఎంపీపీ)లో వాడుతున్న దిగుమతి బొగ్గుకు ఇండెక్స్ ధరలు నిర్ణయించడానికి ఏం ఫార్ములా వాడుతున్నారో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త విధానంతో ముంద్రా, కృష్ణపట్నంలో ఉన్న పవర్ ప్లాంట్లకు లబ్ది చేకూరుతుందో లేదో తెలపాలని పేర్కొన్నారు. విజయ్ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకు విద్యుత్, బొగ్గు గనుల సహాయ మంత్రి సమాధానమిచ్చారు. వాటాదారుల సంప్రదింపులు, స్టాండర్డ్ బైండింగ్ డాక్యుమెంట్ల ప్రకారం నిపుణుల కమిటీ రిపోర్టును రూపొందించిందని, దేశీయ కోల్ బ్లాక్‌ల కేటాయింపులకు అనుగుణంగా ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్లకు మార్గదర్శకాలకు రూపొందించామని చెప్పారు. యూఎంపీపీల కోసం బొగ్గు దిగుమతులు ఇంకా ఖరారులోనే ఉన్నాయని పేర్కొన్నారు. -
ఆల్ట్రా పవర్ ప్రాజెక్టు ఒప్పందం రద్దు!
ముంబై: అనీల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పవర్ సంస్థ ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు (యుఎంపీపీ) నుంచి తప్పుకుంది. జార్ఖాండ్‌లో 3960 మెగావాట్ల ఆల్ట్రా పవర్ ప్రాజెక్టు కోసం అక్కడి ప్రభుత్వంతో రిలయన్స్ పవర్ ఒప్పందం కుదుర్చుకుంది. 36 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టుని హజారీబాగ్ జిల్లాలో నిర్మించతలపెట్టారు. అయితే ఈ ఒప్పందం కుదుర్చుకొని అయిదేళ్లు పూర్తి అయినా ప్రాజెక్టుకు కావలసిన భూమిని ప్రభుత్వం సమకూర్చలేదు. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు రిలయన్స్ పవర్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.