UN Development Programme
-
దారిద్య్రం నుంచి విముక్తి చెందారు
ఢిల్లీ: భారత్‌లో దశాబ్ద కాలంలో 27.1 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్టు ఐక్యరాజ్య సమితి రూపొందించిన బహుపార్శ్వపు పేదరిక సూచిక (మల్టీడైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ – ఎంపీఐ) వెల్లడించింది. యూఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్డీపీ), ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ కలసి రూపొందించిన ఈ సూచిక తాలూకూ నివేదిక ప్రకారం – మన దేశం వేగంగా పేదరికాన్ని తగ్గించగలుగుతోంది. జార్ఖండ్ వేగవంతమైన అభివృద్ధి దిశగా సాగుతోంది. ఆ రాష్ట్రంలో పదేళ్ల(2005–6, 2015–16)కాలంలో పేదరికం 46.5 శాతం మేరకు తగ్గింది. ఇండియా, ఇథియోపియా, పెరూ దేశాలు పేదరికాన్ని తగ్గించడంలో చెప్పుకోదగిన రీతిలో ముందున్నాయి. 101 దేశాల సూచికలను ఈ నివేదికలో పొందుపరిచారు. ఇందులో 31 స్వల్పాదాయ దేశాలు, 68 మధ్యాదాయ దేశాలు. ఆయా దేశాల్లో 130 కోట్ల మంది బహుముఖ పేదరికాన్ని అనుభవిస్తున్నారు. పేదరికాన్ని, అది ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలనేది ఐక్య రాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో మొదటిది. నివేదిక ఈ విషయాన్ని గుర్తు చేస్తూ 200 కోట్ల జనాభా గల 10 దేశాలు (భారత్, బంగ్లాదేశ్, కంబోడియా, కాంగో, ఇథియోపియా, హైతి, నైజీరియా, పాకిస్తాన్, పెరు, వియత్నాం) దశాబ్ది కాలంలో ఈ లక్ష్య సాధన దిశగా చెప్పుకోదగ్గ ప్రగతి సాధించాయని వెల్లడించింది. పై పది దేశాల్లో పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాలు మరింత పేదరికం మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. -
అమాత్యుని..అభివృద్ధి చూతము రారండి!
దర్శి: జిల్లాకు చెందిన ఏకైక మంత్రి శిద్దా రాఘవరావు తన నియోజకవర్గం దర్శిలో అభివృద్ధి చేశామని శిలాఫలకాలు వేసుకోవడం తప్ప ఎక్కడా ఆ జాడ కనిపించడం లేదు. వీధికో శిలాఫలకం వేయడం లక్షలాది రూపాలయలు నిధులు కేటాయించడం.. తెలుగు తమ్ముళ్లు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి తిలా పాపం తలా పిడికెడు అన్న సామెతగా అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై దోచుకున్నారనేందుకు బసిరెడ్డిపల్లె గ్రామమే ఒక ఉదాహరణ. బసిరెడ్డిపల్లెలో గురువారం రాత్రి చిన్నపాటి వర్షం కురిసింది. చిన్న వర్షానికి గతంలో వేసిన సిమెంట్ రోడ్లలో నీరు అలాగే నిలబడిపోయింది. మంత్రి శిద్దా రాఘవరావు అధికారంలోకి వచ్చిన తర్వాత వీధి కాలువలు నిర్మించారు. నిర్మాణాలు లోపభూయిష్టంగా ఉండటంతో కాలువల్లో మురుగు బయటకు వెళ్లే అవకాశమే లేదు. ఇదీ మంత్రి శిద్దా రాఘవరావు అభివృద్ధి పేరుతో ప్రజాధనం ఖర్చు చేసి.. చేస్తున్న అభివృద్ధి తీరు. ప్రజాధనం దుర్వినియోగం చేయడమేగాక గతంలో వేసిన సిమెంట్ రోడ్లు కూడా బుదరమయం చేయడం టీడీపీ ప్రభుత్వానికే చెల్లిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామంలో వీధి కాలువలు రోడ్డుకంటే ఎత్తులో నిర్మించారు. వీధి కాలువల్లో నీరు బయటకు వెళ్లే వీల్లేకుండా గ్రామంలోకి పల్లం..గ్రామం బయటకు మెరక పెట్టి నిర్మించారు. దీంతో రోడ్డుపై పడిన వాననీరు కూడా వీధి కాలువల్లోకి వెళ్లే అవకాశమే లేకుండాపోయింది. చిన్న వర్షం కురిసినా నీరు రోడ్డుపైనే చిన్నపాటి వర్షం కురినినా నీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. దీనికి తోడు గ్రామంలో వీధి కాలువలు నిర్మాణాలు జరిగిన సమయంలో నివాసాల ముందు పెద్ద పెద్ద గుంతలు చేసి పూడ్చకుండా వెళ్లిపోయారని గ్రామస్తులు వాపోయారు. దీంతో ఒక్కో ఇంటికి రూ.20 నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేసి మెరకలు పోసుకుని కాలువలపై బండలు వేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలు చేస్తున్న సమయంలో రోడ్డు కంటే కాలువలు ఎత్తు పెడుతున్నారని, గ్రామంలోకి పల్లం..ఊరి చివర మెరక పెట్టి కాలువలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించినా పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. కాలువల్లో నీరు బయటకు వెళ్లక ఎక్కడి మురుగు అక్కడే ఆగిపోతోందని వాపోతున్నారు. దోమలు ప్రబలి విషజ్వరాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో టీడీపీ నాయకులు అభివృద్ధి చేందుతున్నారేగానీ గ్రామానికి మాత్రం అభివృద్ధి చేయక పోగా సమస్యలు తెచ్చి పెట్టారని గ్రామస్తులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి గ్రామంలో అన్నీ వీధుల్లో సిమెంట్ రోడ్లు వేయించారు. వీధి కాలువలు నిర్మించే సమయానికి ఎన్నికలు వచ్చాయి. మళ్లీ కాలువుల నిర్మాణాలు చేపట్టి గ్రామంలో మురుగు బయటకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
అభివృద్ధి అసమానం
స్టాక్‌హోం: గత పాతికేళ్లలో మానవుడు పలు రంగాల్లో ఎంతో పురోగతి సాధించినా శరణార్థులు, వలసదారులు, మహిళలు ఇంకా వెనకబడి ఉన్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి పేర్కొంది. ‘ప్రజలు ఇప్పుడు సుదీర్ఘ కాలం జీవిస్తున్నారు. చాలా మందికి కనీస వసతులన్నీ అందుబాటులోకి వచ్చాయి. అయినా మానవాభివృద్ధి అసమానంగా ఉంది’ అని స్టాక్‌హోంలో విడదలైన ఐరాస అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) నివేదిక నిగ్గుతేల్చింది. 1990–2015 మధ్య ప్రపంచ జనాభా 200 కోట్లు పెరిగిందని, 100 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడించింది. 210 కోట్ల మందికి మెరుగైన పారిశుద్ధ్యం అందుబాటులోకి వచ్చిందని, 260 కోట్ల మంది సురక్షిత నీటిని పొందుతున్నారని తెలిపింది. 1 శాతం జనాభా చేతిలోనే 46 శాతం సంపద ఉందని పేర్కొంది.