un identified men
-
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
భువనగిరి మండలం వాడపర్తి గ్రామంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి(45) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఊరి శివార్లలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అర్ధరాత్రి దుండగుల బీభత్సం
-
అర్ధరాత్రి దుండగుల బీభత్సం
హైదరాబాద్: నగరంలో గుర్తుతెలియని దుండగులు బీభత్సం సృష్టించారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సనత్ నగర్ సమీపంలోని అల్లావుద్దీన్ కోఠి బస్తీ ప్రాంతంలో దాదాపు 23 వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంత వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.