పటిష్టస్థితిలో హైదరాబాద్
జింఖానా, న్యూస్‌లైన్: కల్నల్ సీకే నాయుడు అండర్-25 టోర్నమెంట్లో హైదరాబాద్ ‘ఎ’ జట్టు తొలిఇన్నింగ్స్‌లో 114 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో నిమేష్ రెడ్డి సెంచరీతో కదంతొక్కడంతో జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది.
ఎన్ఎఫ్సీ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బుధవారం మూడో రోజు విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 82.4 ఓవర్లలో 276 పరుగులు చేసి ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్ సాకేత్ సాయిరామ్ 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కట్టడిచేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 44 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చే సింది. నిమేష్ రెడ్డి (107; 16 ఫోర్లు; 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా, రోహిత్ నాయుడు 30 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. విదర్భ బౌలర్ సార్వతే రెండు వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని హైదరాబాద్ ప్రస్తుతం 286 పరుగులు ముందంజలో ఉంది.