unemployment fund
-
‘వినోద్ పార్టీ మారరు’
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం అందరం కలిసి పని చేస్తామని, మాజీ మంత్రి జి.వినోద్ పార్టీ మారబోరని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ స్పష్టంచేశారు. వినోద్ పార్టీ మారతారనేది కేవలం మీడియా సృష్టి అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు రాకేశ్‌కుమార్, కిషన్‌రావు, రంగారెడ్డిలతో కలిసి సుమన్ తెలంగాణభవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టో ప్రకటించడంతో ప్రజలలో సంతోషం పెల్లుబుకుతోంది. నిరుద్యోగ భృతి రూ.3,016 ఇస్తామని చెప్పడంతో ఉద్యమంలో పాల్గొన్న వేలాది మంది యువతకు ఊరట కలిగించే అంశం. అలాగే రైతుబంధు మొత్తాన్ని ఎకరానికి రూ.10వేలకు పెంచడం హర్షణీయం. రైతులకు రూ.16 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిది. సీఎం కేసీఆర్ రైతు బిడ్డే కాబట్టి మరోసారి రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. మా పాక్షిక మేనిఫెస్టోతో కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోనే విడుదల కాలేదు. కాపీ కొట్టే ప్రసక్తి ఎక్కడిది? కాంగ్రెస్ నాయకులది ఒక్కొక్కరిదీ ఒక్కోదారి. వాళ్ల మేనిఫెస్టోలో ఏముంటుందో వారికే తెలియదు’’అని ఎద్దేవా చేశారు. -
నిలువునా ముంచావు.. ఇక దిగిపో బాబూ
సాక్షి, విజయవాడ సిటీ : ఇంటికొక ఉద్యోగం.. లేదంటే రూ.2 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానంటూ యువతను నిలువునా ముంచేసిన చంద్రబాబూ.. ఇక సీఎం పదవి నుంచి దిగిపో అంటూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగులు సోమవారం విజయవాడలోని యూత్ సర్వీసు కమిషనర్ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే సలాం బాబు, జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. ‘నిరుద్యోగ భృతిపై ఆశ కల్పించావు.. నిలువునా ముంచావు’, ‘ఇక చాలు.. దిగిపో బాబు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్కే సలాం బాబు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తుండటంతో యువతను మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు.. కొత్తనాటకానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 30 లక్షల మంది నిరుద్యోగులుంటే.. కేవలం 10 లక్షల మందికే నిరుద్యోగ భృతి ఇస్తామని, అది కూడా రూ.వెయ్యి మాత్రమే ఇస్తామని ప్రకటించడం ద్వారా యువతను నట్టేట ముంచేశారని మండిపడ్డారు. జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఎలాంటి షరతులు లేకుండా రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం యూత్ సర్వీస్ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని పక్కాగా అమలు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటరీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, నగర కార్యదర్శులు అశోక్, అర్జున్, నరసింహ, శ్యామ్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అప్పుడు రూ.2వేలు అని, ఇప్పుడు ....
హైదరాబాద్ : నిరుద్యోగ భృతి విషయంలో చంద్రబాబు నాయుడు సర్కార్ మోసం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.2వేల భృతి ఇస్తామని, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా రూ.1000 ఇస్తామంటున్నారని వారు వ్యాఖ్యానించారు. అది కూడా ఎప్పటి నుంచి ఇస్తారో కూడా మంత్రి యనమల చెప్పలేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. లబ్దిదారుల ఎంపిక పేరిట ఆంక్షలు కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిరుద్యోగుల నెత్తిమీద చంద్రబాబు టోపీ పెడుతున్నారని ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు.