an unidentified man
-
కత్తులు, బ్లేడ్లతో అనుమానితుల సంచారం
అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని మల్‌చెర్వుతండాలో బుధవారం కలకలం రేగింది. కత్తులు, బ్లేడ్లతో సంచరిస్తున్న ఒక వ్యక్తిని తండా వాసులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన కొందరు బుధవారం ఉపాధి పనులకు వెళ్లి వస్తుండగా నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పిల్లల చుట్టూ అనుమాస్పదంగా తిరుగుతూ కనిపించారు. దీంతో వారు అరవడంతో ముగ్గురు స్థానిక గుట్టల్లోకి పారిపోయారు. ఒకరిని పట్టుకున్నారు. అతని వద్ద కారం ప్యాకెట్, బ్లేడ్లు, కత్తి ఉండడంతో గిరిజనులు భయభ్రాంతులకు గురయ్యారు. అతడిని పోలీసులకు అప్పగించారు. పార్థి గ్యాంగ్ సంచరిస్తుందన్న వార్తలతో స్థానికంగా మొదలైన ఆందోళన ఈ ఘటనతో రెట్టింపైంది. ఎవరూ భయపడవద్దు.. ఈ విషయంపై ఎస్ఐ బానోతు పాపయ్యనాయక్‌ను సంప్రదించగా.. మల్‌చెర్వుతండాలో గిరిజనులు పట్టుకున్న వ్యక్తికి మతిస్థితం లేదన్నారు. అతను బీహార్, మహారాష్ట్రకు చెందినట్లు చెబుతున్నాడన్నారు. కొన్ని సార్లు కన్నడ మాట్లాడుతున్నాడన్నారు. ఈ విషయంపై సమగ్రంగా విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఎవ్వరూ భయపడవద్దని, ఎవరైనా అనుమానితులు సంచిరిస్తే సమాచారం అందించాలని సూచించారు. నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. -
ప్రొద్దుటూరులో చైన్ స్నాచింగ్
ప్రొద్దుటూరు క్రైం: పట్టణంలోని శ్రీరాంనగర్‌లో మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సోముల లక్షుమ్మ టీ దుకాణం నిర్వహిస్తోంది. మంగళవారం ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న తాళి బొట్టు సరుడును లాక్కొని పరుగెత్తాడు. దొంగ దొంగా అని ఆమె అరిచేలోపే అతను కనిపించకుండా వెళ్లిపోయాడు. తాళిబొట్టు సరుడు సుమారు 40 గ్రాములు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ బాలస్వామిరెడ్డి తెలిపారు. -
రైలు కింద పడి ఒకరి ఆత్మహత్య
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (50)రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా పట్టాలపై పడి ఉన్న మృతదేహాన్ని బుధవారం ఉదయం రైల్వే పోలీసులు గుర్తించారు. ఖద్దరు పంచె, చొక్కా ధరించి ఉన్న అతని కుడిచేతిపై శ్రీరాముడు అని పచ్చబొట్టు ఉందని రైల్వే ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.