కత్తులు, బ్లేడ్లతో అనుమానితుల సంచారం | An unidentified man was arrested | Sakshi
Sakshi News home page

మాల్‌చెర్వుతండాలో అనుమానితుల సంచారం

Published Thu, May 24 2018 9:34 AM | Last Updated on Thu, May 24 2018 9:34 AM

An unidentified man was arrested - Sakshi

పోలీసులు అదుపులో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి

అక్కన్నపేట(హుస్నాబాద్‌): మండలంలోని మల్‌చెర్వుతండాలో బుధవారం  కలకలం రేగింది. కత్తులు, బ్లేడ్లతో సంచరిస్తున్న ఒక వ్యక్తిని తండా వాసులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన కొందరు బుధవారం ఉపాధి పనులకు వెళ్లి వస్తుండగా నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు  పిల్లల చుట్టూ అనుమాస్పదంగా తిరుగుతూ కనిపించారు.

దీంతో వారు అరవడంతో ముగ్గురు స్థానిక గుట్టల్లోకి పారిపోయారు.  ఒకరిని పట్టుకున్నారు. అతని వద్ద కారం ప్యాకెట్, బ్లేడ్లు, కత్తి ఉండడంతో గిరిజనులు  భయభ్రాంతులకు గురయ్యారు. అతడిని పోలీసులకు అప్పగించారు. పార్థి గ్యాంగ్‌ సంచరిస్తుందన్న వార్తలతో స్థానికంగా మొదలైన ఆందోళన ఈ ఘటనతో రెట్టింపైంది.

ఎవరూ భయపడవద్దు.. 

ఈ విషయంపై ఎస్‌ఐ బానోతు పాపయ్యనాయక్‌ను సంప్రదించగా.. మల్‌చెర్వుతండాలో గిరిజనులు పట్టుకున్న వ్యక్తికి మతిస్థితం లేదన్నారు. అతను బీహార్, మహారాష్ట్రకు చెందినట్లు చెబుతున్నాడన్నారు. కొన్ని సార్లు కన్నడ మాట్లాడుతున్నాడన్నారు. ఈ విషయంపై సమగ్రంగా విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఎవ్వరూ భయపడవద్దని, ఎవరైనా అనుమానితులు సంచిరిస్తే సమాచారం అందించాలని సూచించారు. నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement