మతవివాదాల్లో అమీర్ ఖాన్ సినిమా, యూనిట్ డైరెక్టర్ అరెస్ట్
అమీర్ ఖాన్ నటిస్తున్న 'పి.కె' సినిమా మత వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రం యూనిట్ డైరెక్టర్ ఒకరిని అరెస్ట్ చేసి అతనిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ చిత్రాన్ని ఢిల్లీలోని చాంద్నీ చౌక్ వద్ద షూటింగ్ తీసినపుడు మతవిశ్వాసాలకు భంగం కలిగించేలా వ్యవహరించారని కేసు నమోదైంది.
ఓ వ్యక్తికి శివుడి వేషం వేసి రిక్షా లాగే సన్నివేశాన్ని చిత్రీకరించారని, తద్వరా తమ మత విశ్వాసాలను దెబ్బదీసేలా వ్యవహరించారని స్థానికులు ఫిర్యాదు చేశారు. 285 ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్నారు. కాగా సినిమాలో ఇది కీలక సన్నివేశమని, షూటింగ్‌కు చట్టపరంగా అన్ని అనుమతులు తీసుకున్నామని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. చిత్ర హీరో అమీర్ ఖాన్‌పై కేసు పెట్టలేదు.