మతవివాదాల్లో అమీర్ ఖాన్ సినిమా, యూనిట్ డైరెక్టర్ అరెస్ట్ | religious controversy on Aamir khan upcoming film, unit director arrested | Sakshi
Sakshi News home page

మతవివాదాల్లో అమీర్ ఖాన్ సినిమా, యూనిట్ డైరెక్టర్ అరెస్ట్

Published Sat, Oct 12 2013 2:07 PM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

religious controversy on Aamir khan upcoming film, unit director arrested

అమీర్ ఖాన్ నటిస్తున్న 'పి.కె' సినిమా మత వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రం యూనిట్ డైరెక్టర్ ఒకరిని అరెస్ట్ చేసి అతనిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ చిత్రాన్ని ఢిల్లీలోని చాంద్నీ చౌక్ వద్ద షూటింగ్ తీసినపుడు మతవిశ్వాసాలకు భంగం కలిగించేలా వ్యవహరించారని కేసు నమోదైంది.

ఓ వ్యక్తికి శివుడి వేషం వేసి రిక్షా లాగే సన్నివేశాన్ని చిత్రీకరించారని, తద్వరా తమ మత విశ్వాసాలను దెబ్బదీసేలా వ్యవహరించారని స్థానికులు ఫిర్యాదు చేశారు. 285 ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్నారు. కాగా సినిమాలో ఇది కీలక సన్నివేశమని, షూటింగ్కు చట్టపరంగా అన్ని అనుమతులు తీసుకున్నామని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. చిత్ర హీరో అమీర్ ఖాన్పై కేసు పెట్టలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement