సమైక్యాంధ్ర తీర్మానమే ప్రధాన డిమాండ్: విజయమ్మ
సమైక్యాంధ్ర తీర్మానమే తమ ప్రధాన డిమాండ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో వైఎస్ విజయమ్మ సాక్షితో మాట్లాడుతూ...శాసనసభలో సమైక్యాంధ్ర తీర్మానం జరిగితేనే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కలసి రావాలని ఆమె అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడుతున్న విషయాన్ని వైఎస్ విజయమ్మ ఈ సందర్బంగా గుర్తు చేశారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దేశవ్యాప్తంగా మద్దతు కూడగడుతున్నారని తెలిపారు. 75 శాతం మంది ప్రజలు సమైక్యవాదాన్నే వినిపిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని కోట్లాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు.