upparpalli
-
దారుణం.. ఆలస్యంగా వచ్చాడని ఓలా డ్రైవర్‌ను చితకబాదిన గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. క్యాబ్ బుక్ చేస్తే అరగంట ఆలస్యంగా వచ్చినందుకు డ్రైవర్, అతని యజమానిని చితకబాదింది ఓ గ్యాంగ్. ఈ ఘటనలో డ్రైవర్, ఓనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఉప్పర్‌పల్లికి చెందిన వినయ్ రెడ్డి అనే యువకుడు ఓలా క్యాబ్ బుక్ చేశాడు. అరగంట ఆలస్యం కావడంతో డ్రైవర్‌ను నిలదీశాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఓలా డ్రైవర్‌పై వియన్ రెడ్డి అతని స్నేహితులు దాడి చేశారు. డ్రైవర్ ఈ విషయాన్ని తన యజమానికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. వెంటనే ఉప్పర్‌పల్లికి చేరుకున్న యజమానిని సైతం వియన్ రెడ్డి గ్యాంగ్ చితకబాదింది. రౌడీల్లా రెచ్చిపోయి ఉదయం 4 గంటల వరకు ఓ గదిలో బంధించి కొట్టారు. చదవండి: ట్రాఫిక్ రద్దీకి చెల్లు.. సైబరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం -
ఉప్పర్‌పల్లి ర్యాంప్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై రెండు ర్యాంపులు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఉప్పర్‌పల్లిలో పీవీఆర్ ఎక్స్‌ప్రెస్‌వేకు కనెక్టివిటీగా నిర్మించిన ర్యాంపును శనివారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ర్యాంపు ద్వారా ఐటీ ప్రాంతానికి వేగంగా ప్రయాణించే అవకాశం కలిగిందని అన్నారు. రూ. 22 కోట్లతో అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 164 దగ్గర ర్యాంపుల నిర్మాణం జరిగింది. ఈ ర్యాంపును హెచ్ఎండీఏ సంస్థ నిర్మించింది. ఈ ర్యాంపుల అందుబాటుతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే ప్రయాణికులు ఉప్పర్‌పల్లి వద్ద దిగి టోలీచౌకి, ఐటీ కారిడార్, ఇతర ప్రాంతాలకు త్వరగా చేరవచ్చని ఆయన తెలిపారు. ఈ ర్యాంపుల అందుబాటుతో రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, బుద్వేల్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ తగ్గనుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్ర రెడ్డి, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసి, నగర మేయర్ జి విజయ లక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. MA&UD Minister @KTRTRS inaugurated the newly constructed ramps of PVNR Expressway at Upparpally today. pic.twitter.com/TeaI0pnJ2L — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 29, 2021 చదవండి: వృద్ధాప్య పింఛన్ రూ.1,500 నుంచి రూ.3,016కు పెంపు -
రేవ్ పార్టీపై పోలీసుల దాడి
మేడ్చల్/ కుత్బుల్లాపూర్, న్యూస్‌లైన్: నగర శివార్లలోని రిసార్ట్‌లో జరుగుతున్న రేవ్‌పార్టీపై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు. 27 మంది యువకులు, పది మంది యువతులను, నలుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్లో బాలానగర్ డీసీపీ ఏ.ఆర్ శ్రీనివాస్ సోమవారం వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం ఉప్పర్‌పల్లిలో ఉన్న లియోనియా రిసార్ట్‌లోని విల్లా నంబర్ 74లో రేవ్ పార్టీ జరుగుతోందని సమాచారం అందడంతో ఆదివారం అర్ధరాత్రి సైబరాబాద్ ఎస్ఓటీ సీఐ వెంకట్‌రెడ్డి, బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్‌లు సిబ్బందితో దాడి చేశారు. మద్యం, డ్రగ్స్ మత్తులో ఉండి, అశ్లీల నృత్యాలు చేస్తున్న 27 మంది యువకులు, 10 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు నిర్వాహకులు రమేష్, కరీముల్లా, సూర్యం, రాఖీ రాత్వాల్‌లనూ అరెస్ట్ చేశారు. ఘటనా స్థలంలో రూ. 4.45 లక్షల నగదు, 35 సెల్ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లతో పాటు కారును స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. లియోనియా రిసార్ట్‌లోని సంబంధిత విల్లా యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసింది ఉత్తర భారతదేశానికి చెందిన ఒక వ్యాపార సంస్థ అని, పట్టుబడిన వారిలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు, రియల్టర్లు, రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారని తెలిసింది. వారి వివరాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరించారు.