Urban Companies
-
స్టార్టప్‌లకు ఇదొక ‘జెమ్’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి ఏర్పాటు చేసిన ‘ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ ‘జీఈఎం/జెమ్’లో చోటు కోసం వినియోగ సేవల ఆధారిత ఇంటర్నెట్ స్టార్టప్‌లు రెంటోమోజో, అర్బన్‌క్లాప్ తదితర సంస్థలు ఇప్పుడు క్యూ కడుతున్నాయి. తమ సేవలు, ఉత్పత్తులను మరిన్ని వర్గాలకు చేరువ చేసేందుకు జెమ్ తమకు ఉపయోగపడుతుందన్నది వాటి భావన. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలను జెమ్ ద్వారా చేరుకునేందుకు అవకాశం ఉండడం వీటిని ఆకర్షిస్తోంది. అందుకే జెమ్‌లో చోటు కోసం ఈ కంపెనీలు ఇప్పటికే పలు మార్లు చర్చలు కూడా జరిపాయి. ఇవి ఫలిస్తే ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలను తమ క్లయింట్ల జాబితాలోకి చేర్చుకునే అవకాశం వీటికి లభించనుంది. అన్నింటికీ ఒకటే... జెమ్‌ను రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ప్రభుత్వ స్వతంత్ర యంత్రాంగాలు తమకు కావాల్సిన సరుకులు, సేవలను కొనుగోలు చేసుకునేందుకు ఏకీకృత మార్కెట్ ప్లేస్‌గా జెమ్‌ను తీసుకొచ్చింది. అన్ని రకాల సేవలకు ఒకే ఉమ్మడి వేదికగా జెమ్ నిలుస్తుంది. ‘‘ఓ ప్రైవేటు కంపెనీగా జెమ్‌తో కలసి పనిచేయాలనుకుంటున్నాం. ఇది సాధ్యమైతే స్వల్ప కాలంలో పెద్ద విజయాన్నే సాధించొచ్చు’’ అని అర్బన్ క్లాప్ సీఈవో అభిరాజ్‌సింగ్ బాల్ పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే జెమ్ అధికారులతో పలు సార్లు చర్చలు జరిపిన బాల్... అర్బన్ క్లాప్ తన సేవలను జెమ్‌పై లిస్ట్ చేసే ప్రక్రియలో ఉన్నట్టు చెప్పారు. పూర్వపు ఎన్డీఏ ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిగా ఉన్న సురేష్ ప్రభు గత డిసెంబర్లో జెమ్ ద్వారా ప్రభుత్వ మార్కెట్‌ను చేరుకునేందుకు ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించడం కీలక మలుపుగా చెప్పుకోవాలి. ‘‘జెమ్‌ద్వారా ఉన్న భారీ అవకాశాల పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. అయితే, ఇంకా అన్వేషణ దశలోనే ఉన్నాం. ఇరు పార్టీలకు గొప్ప విలువ చేకూరే అవకాశాలున్నాయి’’ అని ఆన్లైన్ వేదికగా ఫర్నిచర్‌ను అద్దెకిచ్చే సంస్థ రెంటోమోజో సీఈవో గీతాన్షు బమానియా తెలిపారు. తమ కస్టమర్ల సంఖ్యను మరింత విస్తృతం చేసుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్న కన్జ్యూమర్ ఇంటర్నెట్ కంపెనీలు ఇప్పుడు జెమ్ వైపు ఆశగా చూస్తున్నాయి. ప్రభుత్వానికి ఆదా... ప్రభుత్వ కొనుగోళ్లలో సమర్థతను తీసుకురావడం, కొనుగోలు వ్యయాలను తగ్గించడం వంటి లక్ష్యాలతో ఎన్నో సంపద్రింపుల తర్వాత జెమ్‌ను కేంద్రం ప్రవేశపెట్టగా, అనుకున్న ఫలితాలను ఇస్తోందని నాటి సంప్రదింపుల్లో పాలు పంచుకున్న ఓ పరిశ్రమ నిపుణుడు చెప్పడం గమనార్హం. ముఖ్యంగా ప్రభుత్వ వ్యయాలను తగ్గించడంలో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలను కొనుగోలు చేయడానికి బదులుగా వాటిని రెంటోమోజో వంటి సంస్థల నుంచి అద్దెకు తీసుకోవాలన్నది ఆలోచన. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వస్తువులు, సేవలను స్థిర రేటు విధానంలో ‘డైరెక్టర్ జనరల్ ఫర్ సప్లయ్స్ అండ్ డిస్పోజల్ (డీజీఎస్‌అండ్‌డీ) ద్వారా కొనుగోలు చేసేవి. దీన్ని 2017లో మూసేశారు. -
మున్సిపల్ ఉద్యోగులకు ఏకీకృత నిబంధనలు!
సాక్షి, హైదరాబాద్: .మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థలకు ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది తద్వారా సూపరింటెండెంట్ స్థాయి నుంచి పై స్థాయిలోని అధికారులకు మల్టీ జోనల్, దిగువశ్రేణి సిబ్బందికి రీజినల్ స్థాయిలో బదిలీలకు, పదోన్నతులకు అవకాశం ఏర్పడనుంది. ఇప్పటివరకు మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థల్లో నియమితులైన సిబ్బంది ఇతర కార్పొరేషన్లు లేదా పట్టణాభివృద్ధి సంస్థలకు బదిలీపై వెళ్లడానికి అవకాశం లేదు. దీనితో సిబ్బంది, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంగా ఏకీకృత సర్వీసు నిబంధనల అమలుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఒక కొలిక్కి వచ్చాయి. ఏకీకృత విధానానికి న్యాయశాఖ ఆమోదం తెలిపిందని, ఆర్థిక శాఖ నేడో రేపో ఆమోదం తెలుపవచ్చని పురపాలక శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. ఒకప్పుడు కేవలం ఏడు మాత్రమే ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు ఇప్పుడు 19కి చేరారుు. కొన్ని జిల్లాల్లో రెండేసి మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నల్లగొండ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ కూడా లే దు. కాగా కార్పొరేషన్ల పరిధిలో సూపరింటెండెంట్ స్థాయి నుంచి పై అధికారులను మల్టీజోన్ పరిధిలోకి తీసుకుని వచ్చి వారిని ఒక కార్పొరేషన్ నుంచి మరో కార్పొరేషన్‌కు, అదే సీనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు రీజియన్ పరిధిలో ఉండే కార్పొరేషన్ల పరిధిలో బదిలీ చేయడానికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో 9 పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయి. ఏదైనా పట్టణాభివృద్ధి సంస్థలో ఉద్యోగం చేస్తుంటే ఆ సంస్థలోనే ఒక సీటు నుంచి మరో సీటుకు మార్చడం మి నహా.. ఇప్పటివరకు ఇతర ప్రాంతాలకు బదిలీ చేసే అధికారం లేదు. మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలు చేయనున్నా రు. గతంలో బిల్ కలెక్టర్లుగా నియమితులయ్యేవారు ఆ మునిసిపాలిటీలోనే పదవీ విరమణ చేసేవారు. కానీ ఏకీకృత సర్వీసు విధానంతో జిల్లా పరిధిలో ఉండే ఇతర మున్సిపాలిటీలకు బదిలీ చేయడానికి అవకాశం ఏర్పడింది. జూనియర్, సీనియర్ అసిస్టెంట్లను రీజియన్ పరిధిలో బదిలీ చేయడానికి వీలు కలుగుతుంది.