సాక్షి, హైదరాబాద్: .మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థలకు ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది తద్వారా సూపరింటెండెంట్ స్థాయి నుంచి పై స్థాయిలోని అధికారులకు మల్టీ జోనల్, దిగువశ్రేణి సిబ్బందికి రీజినల్ స్థాయిలో బదిలీలకు, పదోన్నతులకు అవకాశం ఏర్పడనుంది. ఇప్పటివరకు మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థల్లో నియమితులైన సిబ్బంది ఇతర కార్పొరేషన్లు లేదా పట్టణాభివృద్ధి సంస్థలకు బదిలీపై వెళ్లడానికి అవకాశం లేదు. దీనితో సిబ్బంది, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంగా ఏకీకృత సర్వీసు నిబంధనల అమలుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఒక కొలిక్కి వచ్చాయి.
ఏకీకృత విధానానికి న్యాయశాఖ ఆమోదం తెలిపిందని, ఆర్థిక శాఖ నేడో రేపో ఆమోదం తెలుపవచ్చని పురపాలక శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. ఒకప్పుడు కేవలం ఏడు మాత్రమే ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు ఇప్పుడు 19కి చేరారుు. కొన్ని జిల్లాల్లో రెండేసి మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నల్లగొండ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ కూడా లే దు. కాగా కార్పొరేషన్ల పరిధిలో సూపరింటెండెంట్ స్థాయి నుంచి పై అధికారులను మల్టీజోన్ పరిధిలోకి తీసుకుని వచ్చి వారిని ఒక కార్పొరేషన్ నుంచి మరో కార్పొరేషన్‌కు, అదే సీనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు రీజియన్ పరిధిలో ఉండే కార్పొరేషన్ల పరిధిలో బదిలీ చేయడానికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.
ఇక రాష్ట్రంలో 9 పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయి. ఏదైనా పట్టణాభివృద్ధి సంస్థలో ఉద్యోగం చేస్తుంటే ఆ సంస్థలోనే ఒక సీటు నుంచి మరో సీటుకు మార్చడం మి నహా.. ఇప్పటివరకు ఇతర ప్రాంతాలకు బదిలీ చేసే అధికారం లేదు. మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలు చేయనున్నా రు. గతంలో బిల్ కలెక్టర్లుగా నియమితులయ్యేవారు ఆ మునిసిపాలిటీలోనే పదవీ విరమణ చేసేవారు. కానీ ఏకీకృత సర్వీసు విధానంతో జిల్లా పరిధిలో ఉండే ఇతర మున్సిపాలిటీలకు బదిలీ చేయడానికి అవకాశం ఏర్పడింది. జూనియర్, సీనియర్ అసిస్టెంట్లను రీజియన్ పరిధిలో బదిలీ చేయడానికి వీలు కలుగుతుంది.
మున్సిపల్ ఉద్యోగులకు ఏకీకృత నిబంధనలు!
Published Tue, Dec 3 2013 4:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM
Advertisement