Urea import
-
ఏపీలో యూరియా కొరత లేదు : సదానంద గౌడ
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో ఎరువుల కొరత లేదని, రైతులకు సరఫరా చేయడానికి తగినంత యూరియా సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎరువుల శాఖ మంత్రి డి.వి. సదానంద గౌడ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ఈ సందర్భంగా సదానంద గౌడ మాట్లాడుతూ.. 2017-18లో రాష్ట్రంలో 15.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేయగా.. 14.09 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని పేర్కొన్నారు. 2018-19లో 16.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేయగా 14.18 లక్షల మెట్రిక్ టన్నుల విక్రయాలు జరిగాయని మంత్రి వెల్లడించారు. 2019-20లో 17.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. పంటల సీజన్ ఆరంభం కావడానికి ముందు వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి ఆ సీజన్లో ఏ రాష్ట్రంలో ఎంత మేర యూరియా, ఎరువుల అవసరం ఉంటుందో అంచనాలను సిద్ధం చేస్తుందని పేర్కొన్నారు. ఈ అంచనాలు పూర్తయిన తర్వాత నెలవారీ ఎరువుల అవసరాన్ని కూడా అంచనా వేయడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. తయారు చేసిన అంచనాల ప్రకారం ఆయా రాష్ట్రాలకు దేశీయంగా ఉత్పత్తి చేసే ఎరువులు, దిగుమతి చేసుకునే ఎరువులను సరఫరా చేయనున్నట్లు సదానంద గౌడ తెలిపారు. -
రైతన్న ఉసురు తీసిన యూరియా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రైతులను యూరియా కొరత వేధిస్తోంది. గోదాములు, ఎరువుల షాపుల వద్ద అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఇదే పరిస్థితి. పొలాలు, ఇళ్లు వదలి యూరియా పంపిణీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. లైన్లో చెప్పులు పెట్టి మరీ వేచి చూడాల్సిన దుస్థితి. అవసరానికి తగినంత యూరియాను అధికారులు సరఫరా చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యూలో నిలబడి మృతి చెందిన రైతు యూరియా కోసం క్యూలైన్లో నిలబడి రైతు మృతిచెందిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చోటు చేసుకుంది. మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద యూరియా కోసం క్యూలో నిలబడిన రైతు ఎల్లయ్య(69) ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో అతన్నివెంటనే స్థానిక అస్పత్రికి తరలించి చికిత్స అందించిన ఫలితం లేకపోయింది. మృతుడు అచ్చుమాయపల్లి వాసిగా గుర్తించారు. ఎల్లయ్య మృతిపై రైతులు ఆందోళన చేపట్టారు. ఎల్లయ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తూప్రాన్‌లో రైతన్నల ధర్నా మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో యూరియా కొరతపై రైతులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం నుండి యూరియా వస్తుందని పడిగాపులు కాసి రాత్రి వరకు అక్కడే ఉండి ఇంటికి వెళ్లారు. గురువారం ఉదయం ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద బారులు తీరారు. చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం ఎదురు చూశారు. అధికారులు ఎవరు రాకపోవడంతో రైతులు ఆందోళనబాట పట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్దిపైట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో యూరియా కోసం రైతు సేవాసమితి వద్ద బారులు తీశారు. జనగామా జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల పెద్ద ఎత్తున లైన్లో నిలబడ్డారు. యూరియా కోసం పనులు వదిలిపెట్టుకుని క్యూలో నిలబడ్డా ఒక్క బస్తా కూడా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు మృతి చెందడం దురదృష్టకరం రైతు ఎల్లయ్య మృతి పట్ల సిద్ధిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరోత్తంరెడ్డి విచారం వ్యక్తం చేశారు. యూరియా కోసం క్యూలో నిలబడి రైతు మృతి చెందడం దురదృష్టకరం అన్నారు. గురువారం ఆయన బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో యూరియా కోసం రైతులు చెప్పులు క్యూలో పెట్టేవారని ఎగతాళి చేసిన కేసీఆర్‌కు.. రాష్ట్ర రైతుల బాధ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 30 రోజుల ప్రగతి పేరుతో గ్రామాల్లో పన్నులు వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైందని, దీనిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. -
యూరియా స్కాంలో 60 కోట్లు వాపస్
మొనాకోలో కేసు గెలిచిన భారత్ న్యూఢిల్లీ: భారత ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్) సుదీర్ఘ న్యాయపోరాటంలో రూ.60 కోట్లను తిరిగి దక్కించుకుంది. 1995లో జరిగిన యూరియా దిగుమతి కుంభకోణంలో ఆ సంస్థ రూ.133 కోట్లను కోల్పోయిన సంగతి తె లిసిందే. వాటిలో 60 కోట్లను టర్కీకి చెందిన టంకే అలంకస్ మొనాకోలోని ఒక బ్యాంకులో డిపాజిట్ చేశాడు. అప్పటి నుం చి ఆ డబ్బును తిరిగి రాబట్టుకునేందుకు ఎన్ఎఫ్ఎల్ న్యాయపోరాటం చేస్తోం ది. ఆ డబ్బును ఎన్ఎఫ్ఎల్కు చెల్లించాలని మొనాకోలోని అప్పిలేట్ కోర్టు ఆదేశించింది. పారిస్‌లో స్థిరపడిన భారత సంతతి న్యాయవాది విజయ్ ఫడ్కే ఎన్ఎఫ్ఎల్ తరఫున వాదించారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు బంధువు బి.సంజీవరావు, అప్పటి కేంద్రమంత్రి రాంలఖన్ సింగ్ యాదవ్ కుమారుడు ప్రకాశ్ చంద్రలతో పాటు మరో ఏడుగురిపై సీబీఐ కోర్టు కేసు నమోదు చేసింది. భారత్‌కు యూరియా దిగుమతి చేసేందుకు టర్కీకి చెందిన కర్సన్ లిమిటెడ్ కంపెనీతో ఎన్ఎఫ్ఎల్ ఒక ఒప్పందం కుదుర్చుకొని రూ.133 కోట్లను అడ్వాన్స్‌గా చెల్లించింది. అయితే యూరియా పంపించకుండానే ఆ డబ్బును నిందితులంతా పంచుకున్నారు.