16 నుంచి వాము క్రయ, విక్రయాలు
కర్నూలు(అగ్రికల్చర్):కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 16 నుంచి వాము క్రయ, విక్రయాలు జరుగునున్నాయి. మార్కెట్కు వచ్చే వామును టెండర్ పద్ధతిలో కొనుగోలు చేస్తారని మార్కెట్ కమిటీ సెక్రటరీ నారాయణమూర్తి తెలిపారు. వాము పండించిన రైతులు పంటను మార్కెట్కు తీసుకవచ్చి గిట్టుబాటు ధరకు అమ్మకోవాలని ఆయన కోరారు.