మామా కోడళ్ల పోరు
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరంగా ఉన్నత పదవులు పొందాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు ఇప్పుడు ఇంటిపోరు మొదలైంది. జనగామ ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఆయనకు ఇంటి నుంచే పోటీ నెలకొంది. సీటు కోసం పొన్నాల లక్ష్మయ్యకు, ఆయన కోడలు వైశాలికి మధ్య కొన్ని రోజులుగా విభేదాలు తలెత్తాయి.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో ఈ పోటీ కొత్త మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే సీటు కోసం ఇంటి నుంచే పోటీ వస్తుండడంతో... మునిసిపల్ ఎన్నికలను అనుకూలంగా మలుచుకోవాల ని పొన్నాల లక్ష్మయ్య భావించినట్లు తెలిసిం ది. జనగామ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఇప్పుడు జనరల్ మహిళకు కేటాయించారు. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ పదవిని తీసుకుని... వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటుందని లక్ష్మయ్య వర్గం నుంచి వైశాలికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇప్పుడు చైర్మన్‌గా ఉంటే... 2019 ఎన్నికల వరకు జనగామతో పాటు చేర్యాల లేదా మరో కొత్త నియోజకవర్గం అందుబాటులోకి వస్తుందని చెప్పినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనపై వైశాలి నుంచి ప్రతికూల స్పందన వచ్చినట్లు తెలిసింది.
గత ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి ఉండగా... పునర్విభజనతో సాధ్యం కాలేదని, ఇప్పుడు పోటీ చేయాల్సిందేనని ఆమె పట్టుదలతో ఉన్నా రు. మునిసిపల్ చైర్మన్ ప్రతిపాదనతో రెండు రోజులగా వైశాలి అసంతృప్తి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యే గా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయాలని లక్ష్మయ్య కోడలు పొన్నాల వైశాలి పట్టుదలతో ఉన్నారు. మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ఈ మేరకు ఆమె ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అవసరమైతే లక్ష్మయ్య భువనగిరి లోక్‌సభకు పోటీ చేయాలని... తాను మాత్రం ఎమ్మెల్యేగా బరిలో ఉంటానని చెప్తున్నట్టు తెలిసింది. తెలంగాణ ఇచ్చి న నేపథ్యంలో కాంగ్రెస్‌పై సానుకూలత ఉన్న ప్రస్తుత ఎన్నికల్లోనే బరిలోకి దిగాలని వైశాలి భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే మరింత క్రీయాశీలక పాత్ర పోషించే అవకాశం ఉందనే యోచనతో పొన్నాల లక్ష్మ య్య తానే పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ప్రత్యర్థి పార్టీల్లో ముఖ్యు లు లేకపోవడం ఈసారి తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం.. ఎన్నికల ముందే ఏర్పడితే ముఖ్యమంత్రి పదవికి పోటీలో ఉంటానని.. సీనియర్ నేతగా అన్ని అర్హతలు ఉన్నాయని లక్ష్మయ్య భావిస్తున్నారు. కాగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య పేరు బాగా విని పించింది. లక్ష్మయ్యనే ఈ పదవి వరిస్తుం దని ఆయన వర్గీయులు ఇప్పటికీ ఆశిస్తున్నారు. అరుుతే ఇది ఇతర జిల్లా నేతలకు ఖరారైనట్లు ప్రచారం జరుగుతండడంతో పొన్నాలను నిరుత్సాహానికి గురిచేస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలిచి కొత్త రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేందుకు లక్ష్మయ్య సన్నద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పొన్నాల ఇంట్లో నుంచే ఎమ్మెల్యేగా బరిలో దిగేం దుకు ఆయన కోడలు ప్రయత్నాలు ముమ్మ రం చేస్తుండడం.. మున్సిపల్ చైర్మన్ పదవి ప్రతిపాదనను తిరస్కరించడంతో జనగామ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్‌లో ముఖ్యపదవి కోసం పొన్నాల లక్ష్మయ్య మార్గం సుగమం చేసుకుంటుండగా.. జనగామ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం వైశాలి ఢిల్లీ కేంద్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.