నిజాంను సమర్థించడం చరిత్రను వక్రీకరించడమే..
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి
నెహ్రూ యువ సంఘటన్ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్‌రావు
హన్మకొండ: సీఎం కేసీఆర్, కూతురు కల్వకుంట్ల కవిత ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నారని నెహ్రూ యువ సంఘటన్ జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం హన్మకొడ ఎన్జీవోస్ కాలనీలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాం పాలన నుంచి విమోచన కలిగిన సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని భావితరాలకు తెలియకుండా చేయాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. ప్రజలను దోచుకుని, అకృత్యాలకు, నిరంకుశ పాలన గావించిన నిజాం నవాబ్‌పై సీఎం కేసీఆర్‌కు, కూతురు కవితకు ప్రేమేందుకు పుట్టుకొస్తుందని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ గత చరిత్రను బీజేపీ ప్రజల్లోకి తీసుకెళుతుందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు పాల్గొనే తిరంగా ముగింపు యాత్ర నభూతో నభవిష్యత్ అనే రీతిలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. అనంతరం హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తిరంగ యాత్ర ముగింపు సభ జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్కు ప్రత్యమ్నాయంగా బీజేపీ ఎదిగి అధికారంలోకి వస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ 15న మద్దూరు మండలం బైరాన్‌పల్లిలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో పాటు బీజేపీ బృందం పర్యటిస్తుందన్నారు. ఇక్కడ పరకాలలో నిర్మించిన స్మారక కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఽసమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయకులు వన్నాల శ్రీరాములు కాసర్ల రాంరెడ్డి, పెదగాని సోమయ్య, వెంకటేశ్వర్లు, తాళ్ళపల్లి కుమారస్వామి, త్రిలోకేశ్వర్ పాల్గొన్నారు.