Variety dress
-
ర్యాంప్ వాక్ చేస్తుండగా ఈడ్చిపడేసిన సిబ్బంది..ఇంతకీ ఏం జరిగిందంటే..
మోడల్స్ వయ్యారాలు, కాస్ట్యూమ్స్‌కి హద్దేలేదు. మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్లు చిత్రవిచిత్ర ఫ్యాషన్‌తో కనువిందు చేస్తుంటారు. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ మోడల్ స్టైల్‌గా ర్యాంప్ వాక్ చేస్తుంటే, సిబ్బంది అతన్ని పక్కకి ఈడ్చిపడేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ అవుతుంది. ఇంతకీ అతను ఏం చేశాడు? ర్యాంప్ వాక్ నుంచి ఎందుకు నెట్టేశారన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ట్రెండ్ మారేకొద్ది రకరకాల ఫ్యాషన్ స్టైల్స్ పరాకాష్టకు చేరుతున్నాయి. టాలెంట్ ఎవడి సొత్తూ కాదు అనేది ఎంత నిజమో ఫ్యాషన్ కూడా ఎవడి సొంతం కాదు అన్నట్లు ఉన్నారు చాలామంది. కాస్త వెరైటీగా, చిత్ర విచిత్రమైన డ్రెస్‌లో కనిపిస్తే చాలు అదే ఫ్యాషన్ అనుకుంటున్నారు. చిరిగిన బట్టలు, పగిలిన గ్లాస్ ముక్కలు, ప్లాస్టిక్ కవర్స్.. ఇలా ఒకటేమిటి ఫ్యాషన్‌కు కాదేదీ అనర్హం అన్నట్లు రకరకాల కాస్టమ్స్తో దర్శనం ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక మోడల్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకోండి. హెయిర్ స్టైల్, జ్యువెలరీ, బ్యాగ్స్, చెప్పులు, బట్టలు, ఆఖరికి లిప్‌స్టిక్ కలర్స్‌లో కూడా వెరైటీ కోరుకుంటూ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు. ఫ్యాషన్ సెన్స్‌తో నిజంగానే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తారు చాలామంది. మరికొంత మంది మాత్రం తమ స్టైల్‌కు ఫ్యాషన్ అన్న పేరు అంటించేసుకొని వెరైటీ కాస్టూమ్స్‌తో జనాలను కన్ఫ్యూజ్ చేసేస్తుంటారు. తాజాగా న్యూయార్క్ ఫ్యాషన్ షోలో ఇలాంటి వింత ఘటన చోటు చేసుకుంది. అచ్చం మోడల్లా రెడీ అయి వచ్చిన ఓ యువకుడు ర్యాంప్‌పైకి వచ్చి మోడల్లా వాక్ చేశాడు. పాలిథీన్ కవర్నే కాస్టూమ్గా మార్చుకొని వెరైటీ లుక్స్‌తో దర్శనం ఇచ్చాడు. స్టైల్‌గా వాక్ చేస్తూ మోడల్‌లానే బిల్డప్ ఇచ్చాడు. ఇతను నిజంగానే మోడలా? ఈ బట్టలేంట్రా బాబు అని జనాలు ఆలోచించేలోపు నిర్వాహకులు అప్రమత్తమై డమ్మీ మోడల్‌ను పక్కకు ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కవర్‌తో బాడీ కప్పీసి ఇదేం ఫ్యాషన్‌రా బాబు అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, అతని స్టైల్ రియల్ మోడల్‌లానే ఉంది. ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది అంటూ మరికొందరు ఆ యువకుడికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. Given what passes for fashion these days, I wouldn’t be surprised if that was a real outfit. pic.twitter.com/s4y1fttuwc — Censored Men (@CensoredMen) September 11, 2023 -
అబ్బాయిల నేత్రానందం నాకు ముఖ్యం కాదు!
మంచి డ్రెస్ వేసుకున్న తర్వాత పదే పదే నిలువుటద్దంలో చూసుకుని మురిసిపోతుంటారు కొంతమంది. ఈ టైప్ అమ్మాయిలు తమ ఆత్మానందం కోసం మాత్రమే డ్రెస్సులు వేసుకుంటారు. కొంతమంది అమ్మాయిలు మాత్రం ఇతరుల నేత్రానందం కోసం బట్టలు వేసుకోవాలనుకుంటారు. ముఖ్యంగా అబ్బాయిల కోసం ప్రత్యేకంగా డ్రెస్ చేసుకునే అమ్మాయిలు లేకపోలేదు. శ్రుతీహాసన్ మాత్రం ఈ టైప్ కాదు. ఆ విషయం గురించి ఈ బ్యూటీ చెబుతూ - ‘‘నాకు స్టైల్‌గా ఉండటం ఇష్టం. వెరైటీ డ్రెస్సులు ట్రై చేయడానికి ఏమాత్రం వెనకాడను. అబ్బాయిల కోసం మాత్రం డ్రెస్ చేసుకోను. అందమైన బట్టలు వేసుకుని వాళ్లను ఆకర్షించాలని అనుకోను. బయటకు వెళ్లినప్పుడు షాపింగ్ మాల్స్‌లో పెద్ద పెద్ద అద్దాలు కనిపిస్తాయి కదా.. వాటిలో నా ప్రతిబింబం చూసుకోవడానికి డ్రెస్ చేసుకుంటాను. ఇంట్లో అద్దాలుంటాయ్. కానీ, బయట కనిపించే స్టోర్ అద్దాల్లో నన్ను చూసుకోవడం నాకిష్టం. అందుకే డ్రెస్ చేసుకునేటప్పుడు అద్దాలను కూడా గుర్తు పెట్టుకుంటాను. ఆ సంగతలా ఉంచితే.. డ్రెస్సింగ్ అనేది మన అభిరుచికి తగ్గట్టుగా ఉండాలి. ఇతరులు ఏమనుకుంటారో? అని ఆలోచించకూడదు. మనకు సౌకర్యంగా అనిపించే బట్టలు ఇతరులకు చూడ్డానికి బాగాలేకపోయినా వేసుకోవాలి’’ అన్నారు. -
మ్యాచింగ్ మ్యాచింగ్
అందరి కంటే భిన్నంగా, అందంగా కనిపించాలనే తాపత్రయం అమ్మాయిలకు కాస్త ఎక్కువే.. అందుకోసం వెరైటీ డ్రెస్‌ల కోసం వేట సాగిస్తుంటారు. అలాగే భిన్నంగా ఆలోచించినఓ అమ్మాయి కూడా ఓ మాంచి డ్రెస్ వేసుకుని ఆఫీస్‌కు వచ్చింది. తన గదిలోకి వెళ్లగానే నోరు వెళ్లబెట్టడం ఆమె వంతయింది. ఎందుకంటే అక్కడ నేలపై ఉన్న తివాచీ, ఆమె డ్రెస్ మ్యాచ్ అయ్యాయి. ఇంకేం చేస్తుంది వెంటనే డ్రెస్ మార్చుకునేందుకు ఇంటి బాట పట్టింది. పనిలో పనిగా ఓ ఫొటో తీసి నెట్లో ఉంచింది. అంతే ఆ ఫొటో ఇప్పుడు నెట్లో తెగ హల్చల్ చేసేస్తోంది. ఈ ఫొటోను కేవలం 12 గంటల్లో 10 లక్షల మందికి పైగా చూసేశారట. -
సమ్ థింగ్ స్పెషల్
రంగు రంగుల చీరలు... ఏ అవ్మూరుుకైనా ఇట్టే నప్పే వెరైటీ డ్రెస్సులతో ఏర్పాటు చేసిన డిజైర్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. బంజారాహిల్స్ హోటల్ తాజ్‌కృష్ణాలో శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రదర్శనలో సల్వార్ కమీజ్, డిజైనర్ శారీస్, బ్లౌజ్ పీసెస్ వంటివి ఆకర్షణీయుమైన వెరైటీల్లో ఉన్నారుు. వీటితో పాటు డిఫరెంట్ నెరుుల్ పాలిష్‌లు, డోర్ కర్టెన్స్, మైల్డ్ స్టీల్ ఫ్లవర్స్, లేడీస్ ఫుట్‌వేర్, హోం డెకార్ ఐటెమ్స్ కొలువుదీరారుు. వజ్రాభరణాలు స్పెషల్ ఎట్రాక్షన్. నటి సుహానీ తళుకులీనింది. శనివారం కూడా ప్రదర్శన ఉంటుంది. సిటీ ప్లస్